
మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. “చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ముఖ్యంగా వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే సహించేది లేదు. ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం” అని స్పష్టం చేసారు.
అధ్యక్షుడు వాదిమ్లిర్ పుతిన్ పేరును ప్రస్తావించకుండా రష్యాలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పారు. “మా తీసుకునే చర్యలు ఆ మూడు దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే వ్లాదిమిర్ పుతిన్‌కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని ఒత్తిడి చేయండి. లేకుంటే మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తప్పవ్’ అని జనరల్ మార్క్ రుట్టే సూచించారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్కు అమెరికా ఎయిర్‌డిఫెన్స్‌లు మాత్రమే కాకుండా క్షిపణులు కూడా భారీగా సరఫరా చేయనున్నారని ఈ సందర్బంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు రష్యాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యూఎస్ రిపబ్లికన్ సెనెటర్ థామ్ టిల్లిస్ ప్రశంసించారు. కానీ, 50 రోజల వరకు సమయం ఇవ్వడమే తనకు ఆందోళనకు కలిగిస్తుందని తెలిపారు. ఆ సమయంలోనే పుతిన్ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. హత్యలు చేసి, మరింత భూభాగాన్ని అక్రమించిన తర్వాతే ఆయన శాంతి చర్చలు చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.
మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నభారత్, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవలే హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు. “రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్, చైనా దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి” అని పేర్కొన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ]
More Stories
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’