
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ పదేళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8శాతానికి పడిపోయింది.
అయినా అతి పెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6శాతానికి పెరిగింది. ఈ పదేళ్లలో 34.7 కోట్ల మంది ముస్లిం జనాభా పెరిగారు. పెరిగిన అన్ని మతాల వారిని కలుపుకున్నా ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ముస్లింలు 21 శాతం, అంటే 170 కోట్ల నుండి 200 కోట్లకు పెరిగారు. క్రైస్తవులు 12.3 కోట్ల మంది మాత్రమే పెరిగి, మొత్తం జనాభా 230 కోట్లకు చేరుకుంది.
ఐరోపా, ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుంది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ముస్లిం జనాభా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9శాతానికి తగ్గిపోయారని, అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా, 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది.
ప్రపంచ జనాభా పెరుగుదలతో సమానంగా హిందువులు కూడా పెరుగుతున్నారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న నాల్గవ మతం జనాభాగా హిందువులు ఉన్నారు. ఈ పదేళ్లలో 12.6 కోట్ల మంది పెరిగి, మొత్తం మీద 120 కోట్లకు చేరుకున్నారు. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతోందని పేర్కొంది. కాగా మతమార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలోని హిందువుల్లో 95%మంది భారత్‌లోనే ఉంటుదని పేర్కొన్నారు. 2010లో భారత్‌లో హిందువుల జనాభా 80% కాగా, 2020కి ఇది 79 శాతానికి పడిపోయింది.
2050 నాటికి 77 శాతానికి హిందువులు తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో భారత్‌లో ముస్లింల జనాభా14.3% నుంచి 15.2 శాతానికి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది ముస్లిం జనాభా 70 శాతం మేరకు పెరిగి 2060 నాటికి ప్రపంచంలో 300 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
కెనడాలో ముస్లిం జనాభా 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 2010లో 9.40 లక్షలుగా ఉన్న జనాభా 27 లక్షలకు పెరుగుతుందని భావిస్తున్నారు. అమెరికాలో 2010లో 4 ఏళ్లలోపు వయస్సుగల ముస్లిం బాలలు 2 లక్షలు ఉండగా, 6.5 లక్షలకు జరుగుతుందని చెబుతున్నారు. ఉత్తర అమెరికాలో ముస్లిం జనాభా 52 శాతం పెరిగింది. ఈ పదేళ్లలో యాదులు 6 శాతంగా పెరిగి 1.40 కోట్ల మంది నుండి 1.5 కోట్లకు చేరుకున్నారు. కాగా బౌద్దులు 0.8 శాతం తగ్గారు. జనాభా తగ్గుతున్న ప్రధాన మతంగా గుర్తిస్తున్నారు.
యాదులు, బౌద్దులు అత్యధికంగా, 36 శాతం మేరకు 50 ఏళ్లకు పైబడిన వృద్దులుగా ఉన్నారు. 2020లో ముస్లింల జనాభాలో అత్యధికంగా పిల్లలు ఉన్నారని అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ముస్లింలలో 33 శాతం మంది 15 ఏళ్లలోపు వారు ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింలలో దాదాపు పది మందిలో నలుగురు సాపేక్షంగా యువ జనాభా ఉన్న ప్రదేశాలైన సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో నివసిస్తున్నారనే వాస్తవంతో ముస్లింల యవ్వనం ముడిపడి ఉందని అది పేర్కొంది.
భారత్, పాక్, ఇండోనేసియాల్లో మూడోవంతు ముస్లింలు
ప్రపంచంలోని ముస్లింలలో మూడింట ఒక వంతు మంది భారతదేశం, పాకిస్తాన్, ఇండోనేషియా దేశాలలో నివసిస్తున్నారని అధ్యయనం చూపిస్తుంది. 2020 నాటికి భారతదేశంలో దాదాపు 21.3 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు, ఇది దేశ జనాభాలో 15% వరకు ఉంది. భారతదేశం ఇండోనేషియా కంటే కొంచెం వెనుకబడి ఉంది. రెండోది 2020 నాటికి దాదాపు 24 కోట్ల మంది ముస్లింలను కలిగి ఉంది, ఇది ప్రపంచ ముస్లింలలో 12%.
ప్రపంచ ముస్లిం జనాభాలో దాదాపు 65% మంది భారతదేశంతో సహా 10 దేశాలలో నివసిస్తున్నారు. ఈ 10 దేశాలలో 130 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. ఈ తొమ్మిది దేశాలలో, భారతదేశం మినహా ఇస్లాం మెజారిటీ మతంగా ఉంది. కాగా, కజకిస్తాన్, బెనిన్, లెబనాన్, ఒమన్, టాంజానియా అనే ఐదు దేశాలలో ముస్లింల జనాభాలో గణనీయంగా పెరిగింది. ఐదు దేశాలలో, మూడు (కజకిస్తాన్, బెనిన్, లెబనాన్) ముస్లింల జనాభాలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. కజకిస్తాన్‌లో 8.2%, బెనిన్‌లో 7.9%, లెబనాన్‌లో 5.5% పెరిగింది. ఒమన్, టాంజానియాలలో, ముస్లిం జనాభా వరుసగా 8.3%, 5.5% తగ్గుదల నమోదు చేసింది.
ఈ ఐదు దేశాలలో, ముస్లిం జనాభాలో మార్పులు ఎక్కువగా వలసల వల్ల సంభవించాయి. ఈ దేశాలలో కొన్నింటిలో, ముస్లింలు కానివారు దేశాల నుండి వలస వెళ్లడం వల్ల పెరుగుదల సంభవించగా, మరికొన్ని దేశాలలో, ముస్లిం శరణార్థుల ప్రవాహం కారణంగా పెరుగుదల సంభవించింది. ఐరోపాలోని అనేక దేశాలు వలసలు, ముస్లింలలో సగటు కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా వారి ముస్లిం జనాభాలో పెరుగుదలను చూశాయి. అయితే, ఈ దేశాలలో ముస్లిం జనాభాలో వాటాలో మార్పు 5% కంటే తక్కువగా ఉంది.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం