
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎఫ్సీలో ఉద్యోగంలో చేరారు. తన సోదరుడు సుబ్బరాయుడు అప్పట్లో విప్లవకారుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటం, ఆయనకు స్వతహాగా కమ్యూనిజం భావాలు ఉండటంతో అటువైపు ఆకర్షితులయ్యారు. ఎన్ఎఫ్సీలో కార్మికులను కూడగట్టి సంఘాలు ఏర్పాటు చేశారు.
అలా యూసీసీఆర్ఐ-ఎంఎల్ వైపు అడుగులు వేశారు. 1975 నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ విస్తృతి కోసం అనేక పోరాటాలు చేశారు. 1981లో ఎన్ఎఫ్సీకి రాజీనామా చేసి కార్మిక సమస్యలపై పోరాడారు. తన కార్యకలాపాలను జంటనగరాలలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, కార్మిక కేంద్రాలకు విస్తరింపజేశారు.
దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై చేసిన అధ్యయనాలు జరిపారు. 1981 నుంచి 1991 వరకూ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 మార్చిలో విజయ్ను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చావు అంచులవరకూ తీసుకెళ్లారు. ఉన్నత చదువులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వని సంతృప్తిని ప్రజా ఉద్యమాలు ఇచ్చాయని అనేవారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!