* ప్రమాదానికి గురైన విమానంలో లోపాలు లేవన్న ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి శనివారం సమర్పించిన ప్రాథమిక నివేదికలో విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించడంతో విమాన ప్రమాదంపై విభిన్న కధనాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఈ నివేదికపై ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా స్పందిస్తూ ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలూ లేవని స్పష్టం చేశారు.
విమానం నిర్వహణకు సంబంధించి తప్పనిసరి పనులన్నీ పూర్తిచేసినట్లు చెప్పారు. ఇంధన నాణ్యతలో లోపాలు, టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులూ లేవని పేర్కొన్నారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని తేల్చారు. ఆ స్విచ్‌లను ఎయిరిండియా రెండుసార్లు మార్చినట్లుగా చెబుతూ ఇంధన స్విచ్‌లు పూర్తిగా సురక్షితమని అమెరికాకు చెందిన సంస్థ కూడా తేల్చిందని గుర్తు చేశారు. అయితే విమానం టేకాప్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆపి ఉన్నాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
కాగా, బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్ లాక్‌లు సురక్షితంగా ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా విమానంలో స్విచ్‌లు ఆఫ్ కావడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేయడంతో నివేదికను యూఎస్ ప్రభుత్వం వాదనలు తిరస్కరించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం పైలట్లనే బాధ్యతలను చేస్తూ బోయింగ్ కంపెనీని కాపాడేందుకే ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) పౌర విమానయాన అధికారులకు పంపిన నోటిఫికేషన్‌లో ‘ఇంధన నియంత్రణ స్విచ్ రూపకల్పనలో లాకింగ్ ఫీచర్ ఉంటుంది. వివిధ బోయింగ్ విమానాల్లో ఒకే విధంగా ఉంటుంది. బోయింగ్ 787 విమానంతో సహా ఏ ఇతర మోడల్ విమానాలకు ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది.
ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (ఏడి) అనేది విమానం, ఇంజిన్, ప్రొపెల్లర్, ఇతర భాగంలో కనిపించే ఏవైనా అసురక్షిత పరిస్థితులను సరిచేయడానికి ఏవియేషన్ అధికారులు జారీ చేసిన చట్టబద్ధంగా అమలు చేయగల పత్రం. విమానాల సురక్షిత ఆపరేషన్ కోసం ఈ మార్గదర్శకాలు కీలకం.
మరోవంక, ఇక విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ముందు ఇద్దరు పైలట్లకు శ్వాస పరీక్షలు నిర్వహించామని సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్చెప్పారు. ఆ పరీక్షలో వారిద్దరూ బాగానే ఉన్నారని . ఇక వేరే వైద్య పరీక్షలు మాత్రం జరగలేదని సిఈవో చెప్పారు. ఇంకా పూర్తిగా దర్యాప్తు ముగియలేదని, ముందుగానే లేనిపోని కథనాలు సృష్టించొద్దని విల్సన్ కోరారు.
ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీలు చేశామని, సేవలకు అనుకూలంగా ఉన్నాదని నిర్ధారించుకున్నాకే ఉపయోగించినట్లు చెప్పారు. ప్రతి విమానాన్ని తనిఖీలు చేస్తామని, అంతేకాకుండా ఏవైనా కొత్త సూచనలు వస్తే వాటిని కూడా పాటిస్తూ ఉంటామని చెప్పారు. కాగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న బృందంలో విల్సన్ కూడా ఉన్నారు.
ప్రయాణానికి ముందు చేసిన బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పైలట్లు పాసైనట్లు వెల్లడించారు. అధికారుల సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల్లో తనిఖీలు కొసాగుతూనే ఉంటాయని చెప్పారు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీలు చేశామని, సేవలకు అనుకూలంగా ఉన్నదని నిర్ధారించుకున్నాకే ఉపయోగించినట్లు చెప్పారు. ఏఏఐబీ సమర్పించిన ప్రాథమిక నివేదిక విషయంలో అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు.జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయి అగ్నికి అహుతైన ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంధనం అందనందు వల్లే జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకను తేడాలో ఆగిపోయాయి. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టని మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టు రిపోర్టులో ఉంది. కాక్‌పిట్‌లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది.
టేకాఫ్ అయిన వెంటనే ఇంధన స్విచ్‌లను కటాఫ్‌కు మార్చారని, దాంతో విమానం ఇంజిన్‌లకు ఇంధన సరఫరా ఆగిపోయిందని దర్యాప్తులో నివేదికలో పేర్కొన్నారు. పైలట్లు మళ్లీ ఇంధన స్విచ్‌ను ఆన్ చేసే సమయానికి బహుశా చాలా ఆలస్యమై ఉండవచ్చని వేదిక పేర్కొంది. దాంతో బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్‌ల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపం కారణంగా ఇంధన స్విచ్‌లు నిలిచిపోతే ఎలా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఎఫ్‌ఎఫ్ వీటిని తోసిపుచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో 2018లో యూఎస్ ఎఫ్ఏఏ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. ఇది 787తో సహా బోయింగ్ కంపెనీకి చెందిన వివిధ మోడల్ విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్‌ను తనిఖీ చేయాలని సిఫార్సు చేసింది.
ఎఫ్‌ఏఏ మార్గదర్శకాలు తప్పనిసరి కానందున ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఇంధన స్విచ్ లాకింగ్‌ను తనిఖీ చేయలేదని దర్యాప్తులో తేలింది. భారతీయ పైలట్స్ అసోసియేషన్ అల్పా (ఏఎల్ పిఎ) ప్రమాదంలో పైలట్ల వల్ల తప్పిదం జరిగిందనే వాదనలను తిరస్కరించింది. ఈ విషయంలో పారదర్శకంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తులో పరిశీలకులుగా పైలట్లను సైతం చేయాలని కోరింది.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం