
కాగా, బంగ్లాదేశ్లోని హిందువులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పలు యూనివర్సిటీల్లోని హిందూ విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం మూక హింసను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
మరోవైపు లాల్ చంద్ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 19 మందిని నిందితులుగా, సుమారు 20 మంది గుర్తు తెలియని వారిని అనుమానితులుగా పేర్కొన్నారు. లాల్ చంద్ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనపై బీఎన్పీ స్పందిస్తూ లాల్ చంద్ సోహాగ్ను కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొంది.
తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, జర్నలిస్టులపై దాడులకు దారి తీయడం వంటి ఘటనలతో విమర్శలు ఎదుర్కొంటోంది. మైనారిటీలపై దాడులు, ఆలయాల ధ్వంసం, రాజకీయ హింస ఆ ప్రభుత్వ పాలనపై ఆరోపణలకు దారితీస్తున్నాయి. ఢాకాలో చోటుచేసుకున్న ఈ హత్య దేశంలో చట్టం ఉనికిపై ప్రశ్నలు వేస్తోంది. ఎన్నికలపై స్పష్టత లేకపోవడం, ప్రజల ఆవేదనను మరింత పెంచుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా