
దక్షిణాది రాష్ట్రాలు బలోపేతం కాకుండా ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శనివారం కేరళలో బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని, మొరార్జీ భవన్‌ను ప్రారంభించిన ఆయన, అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లు రాష్ట్రంలో అవినీతిని సృష్టించాయని, బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తున్నాయని దుయ్యబట్టారు.
ఈ రెండు పార్టీలు కేరళను ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ) లాంటి దేశ వ్యతిరేక శక్తులకు సురక్షితమైన స్వర్గధామంగా మార్చాయని ఆరోపించారు. పుత్తారికండం మైదానంలో జరిగిన వార్డు స్థాయి నాయకుల సమావేశంలో, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో బీజేపీ పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. అందులో పాల్గొన్న అమిత్ షా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలదని స్పష్టం చేశారు.
“ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వల్ల ఇది సాధ్యంకాదు. బలమైన దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి లేకుండా ‘వికసిత్ భారత్’ సాకారం కాదు. వికసిత్ భారత్‌కు మార్గం ‘వికసిత్ కేరళం’ ద్వారానే ఉంటుంది. కనుక ఇప్పటి నుంచి బీజేపీ ప్రాథమిక లక్ష్యం ‘వికసిత్ కేరళం’ అవుతుంది” అని తెలిపారు. ‘వికసిత్ కేరళం మిషన్’ లోగోను ఆవిష్కరించిన అమిత్ షా, ముఖ్యమంత్రి పీఠం కంటే కేరళ రాష్ట్ర అభివృద్ధే (వికసిత్ కేరళం) తమ ధ్యేయమని చెప్పారు.
2022లో కేంద్ర ప్రభుత్వం ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ)తోపాటు, దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. అయితే పీఎఫ్ఐపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించలేదు. దీనిపై కూడా అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశార ‘పీఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించే అన్ని అధికారాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఎందుకు అలా చేయడం లేదని’ ప్రశ్నించారు.
కానీ మోదీ సర్కార్ దేశ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపిందని, అందులో భాగంగా వివిధ ప్రాంతాలకు వ్యాపించిన పీఎఫ్ఐపై నిషేధం విధించి, దాని అగ్ర నాయకులను అరెస్ట్ చేయించిందని అమిత్ షా పేర్కొన్నారు. “బీజేపీ, సీపీఎం రెండూ కేడర్ అధారిత పార్టీలు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ప్రధానమైన వ్యత్యాసం ఉంది. బీజేపీ కేడర్ కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కానీ సీపీఎం రాష్ట్ర అభివృద్ధి కంటే కార్యకర్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది” అని అమిత్ రు.తెలిపా
అసోం, త్రిపురల్లో బలమైన పార్టీలు ఉన్నప్పటికీ, అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, అలాగే తమిళనాడులో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఇక 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. కేరళలో ఈ ఏడాది చివర్లలో స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?