
నకిలీ ఆధార్ కార్డుల సృష్టిని కట్టడి చేసే మార్గాలు అన్వేషిస్తున్నామని యూఐడీఏఐ ప్రయత్నిస్తోందని భువనేశ్ కుమార్ తెలిపారు. ఆధార్ కార్డులు క్యూఆర్ కోడ్ ద్వారా అంతర్నిర్మిత భద్రతా యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. తాము జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. “యూఐడీఏఐ ఆధార్ క్యూఆర్ స్కానర్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌తో క్యూఆర్ కోడ్‌లో పొందుపరచిన దానితో ఆధార్ కార్డ్ వివరాలను సరిపోల్చవచ్చు. దీంతో ఎవరైనా నకిలీ ఆధార్ కార్డులను తయారుచేస్తుంటే సులభంగా గుర్తించవచ్చు. అలాగే నకిలీ ఆధార్ కార్డుల జారీని ఆపవచ్చు” అని భువనేశ్ కుమార్ తెలిపారు.
“ఫోటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లేట్లను ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులను కొందరు తయారుచేస్తున్నారు. అయితే అవి ఆధార్ కార్డులు కావు. కొత్త ఆధార్ యాప్ రూపకల్పన చివరి దశలో ఉంది. ఇప్పటికే ఒక డెమో పూర్తయింది. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ కార్డు వినియోగదారుడి సమ్మతితో డిజిటల్‌గా గుర్తింపును సజావుగా పంచుకోవడానికి అనుమతిస్తుంది” అని పేర్కొన్నారు.
“కొత్త యాప్ ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను పంచుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. వినియోగదారులు వారి సమ్మతిని బట్టి వారి ఆధార్ వివరాలను పూర్తి లేదా మాస్క్డ్ ఫార్మాట్లో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది” అని భువనేశ్ వివరించారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి