ఇక అన్ని రైల్వే సేవలకు ‘రైల్‌ వన్‌’ యాప్‌

ఇక అన్ని రైల్వే సేవలకు ‘రైల్‌ వన్‌’ యాప్‌
భారతీయ రైల్వే ‘రైల్‌ వన్‌’ పేరుతో ప్రయాణికులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సూపర్‌ యాప్‌ని తీసుకువచ్చింది. ఐఆర్‌సీటీసీ రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌, ప్లాట్‌ఫామ్‌ టికెట్లను బుక్‌ చేసుకోవడంతో పాటు పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, రైలు స్టేటస్‌ ట్రాక్‌, కోచ్‌ పొజిషన్‌, రైల్‌ మదద్‌ సేవలు అందించడంతో పాటు అభిప్రాయాలను సైతం ఒకే యాప్‌ ట్రాక్‌ చేయనున్నది. 
 
స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌ యూజర్లకు మరింత మెరుగైన అనుభవం అందించేందుకు యాప్‌ని పరిచయం చేరసింది.  కొత్త రైల్‌ వన్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ డౌన్‌లోడ్‌ చేరసుకునేందుకు అందుబాటులో ఉన్నది. గతంలో భారతీయ రైల్వేల సేవలకు వివిధ యాప్స్‌ ఉండేవి. దాంతో అన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. 
 
ఈ యాప్‌తో ఒకేసారి సైన్‌ ఇన్‌ అవడంతో ఎక్కువ పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవాల్సిన పని తప్పింది. యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న రైల్‌ కనెక్ట్‌ లేదంటే యూటీఎస్‌ఆన్‌మొబైల్‌ ఐడీని ఉపయోగించి లాగిన్‌ అవ్వొచ్చు. ఎం-పిన్‌, బయోమెటిక్‌ ద్వారా అకౌంట్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఎంక్వైరీ కోసం మొబైల్‌ నంబర్‌/ఓటీపీ అథంటికేషన్‌ ద్వారా గెస్ట్‌ యాక్సెస్‌ సైతం అందుబాటులో ఉంది. 
 
ప్రస్తుతం ప్రయాణికులు ప్రస్తుతం వివిధ సేవల కోసం బహుళ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేస్తున్నారు. టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, భోజనం ఆర్డర్ చేయడానికి  ఐఆర్‌సీటీసీకేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫీడ్‌బ్యాక్ అందించేందుకు రైల్ మదద్, అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్ల కోసం యూటీఎస్‌, రైలు స్టేటస్‌ తెలుసుకునేందుకు నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు. 
 
టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక హక్కులు ఉన్న ఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ 100 మిలియన్స్‌ డౌన్‌లోడ్స్‌ను అధిగమించింది. ఈ యాప్‌ రైల్వేలోనే అత్యంత ప్రజాదారణ ఉన్న యాప్‌ను నిలిచింది. ఇతర ప్లాట్‌ఫామ్స్‌ సైతం టికెట్‌ బుకింగ్స్‌ కోసం ఐఆర్‌సీటీసీపైనే ఆధారపడుతుంటాయి. ఈ సూపర్ యాప్లో సింగిల్ సైన్-ఇన్ ఆప్షన్ ఉంటుంది. కనుక యూజర్లు ఎక్కువ పాస్వర్డ్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం తప్పుతుంది.