
* అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం!
బంకర్ బస్టర్ బాంబుల తయారీ కోసం రెండు అగ్ని-5 నూతన రకాలను భారత్ అభివృద్ధి చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో ఒకటి భూమిపై ఉన్న లక్ష్యాల కోసం రూపొందిస్తుండగా మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించగలిగేదిగా ఉండనుంది. పాకిస్థాన్, చైనా వంటి శత్రు దేశాలలోని కమాండ్-అండ్-కంట్రోల్ కేంద్రాలు, భూగర్భ క్షిపణి, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని హైపర్‌సోనిక్ ఆయుధాలుగా చెబుతారు.
కొత్తగా అభివృద్ధి చేసే అగ్ని-5 క్షిపణి కొత్త వేరియంట్లు పయనించే దూరం 2,500 కిలోమీటర్లు తగ్గనున్నది. అధిక బరువుతో కూడిన బాంబును తీసుకెళ్లగల ఈ కొత్త వేరియంట్లు భారత్ వ్యూహాత్మక అస్త్ర సంపదకు మరింత బలం చేకూర్చగలదు. పాక్, చైనా వంటి శత్రు దేశాల కీలక సైనిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణులను భద్రపరిచిన స్థావరాలను ఈ క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేయగలవు. హైపర్‌సానిక్ బాంబులుగా పిలిచే ఈ బంకర్ బస్టర్ బాంబులు అమెరికా బాంబుల కన్నా అధిక బరువు ఉండడమేగాక అత్యంత శక్తివంతమైనవి.
మరోవంక, ఆపరేషన్ సిందూర్ అనుభవాలు, పాఠాల నుంచి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. మిలిటరీ నిఘా సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేసుకోవటంపై దృష్టి సారించింది. పాకిస్థాన్, చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతరిక్ష ఆధారిత సైనిక నిఘా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. 2029లోగా 52 డిఫెన్స్ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ సిద్ధమవుతున్నది.
రూ.26,968 కోట్ల వ్యయంతో ‘స్పేస్ బేస్డ్ సర్వైవలెన్స్ ఫేజ్-3’ (ఎస్‌బీఎస్-3) ప్రోగ్రాంను చేపట్టింది. ఫేజ్-3 కింద చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా నిరంతర ట్రాకింగ్, నిఘా మెరుగుపర్చటం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్‌బీఎస్-3 ప్రోగ్రాంకు కేంద్ర క్యాబినెట్ కమిటీ గత ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు