
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) చీఫ్ నేతృత్వంలోని బహుళ విభాగ బృందం దర్యాప్తు చేపడుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విమానంలోని బ్లాక్ బాక్స్ నుండి డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొంది. ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఎటిసి అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్ను రూపొందించిన అమెరికా దర్యాప్తు సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టిఎస్బి) ప్రతినిధులు ఈ బృందంలో ఉంటారని విమాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జూన్ 25న సాయంత్రం ఎఎఐబి డైరెక్టర్ జనరల్ జివిజి యుగంధర్ నేతృత్వంలోని బృందం ఎఎఐబి, ఎన్టిఎస్బి నుండి సాంకేతిక సభ్యులతో సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముందు బ్లాక్ బాక్స్ నుండి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సిపిఎం)ను సురక్షితంగా తీశారని, జూన్ 25 మెమరీ మాడ్యూల్ విజయవంతంగా యాక్సెస్ చేయబడిందని, దాని నుండి డేటాను ఎఎఐబి ల్యాబ్లో డౌన్లోడ్ చేసినట్లు తెలిపింది.
కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డిఆర్) విశ్లేషణ జరుగుతోందని వెల్లడించింది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలను నివారించేందుకు అవసరమైన అంశాలను గుర్తించడం లక్ష్యమని ఆ ప్రకటన పేర్కొంది.
దీంతో బ్లాక్ బాక్స్ డేటా ద్వారా ప్రమాద సమయంలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు బ్లాక్బాక్స్ డేటా విశ్లేషణ ఉపకరించనుందని పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఓ ఇంటి పైకప్పు నుంచి సీవీఆర్, ఎఫ్డీఆర్ రికవరీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీవీఆర్ను జూన్ 13వ తేదీన , ఎఫ్డీఆర్ను జూన్ 16వ తేదీన వెలికితీసినట్లు చెప్పారు. అహ్మదాబాద్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటాకు భద్రత కల్పించామని, పోలీసులు, సీసీటీవీ నిఘాలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. పూర్తి భద్రత మధ్య బ్లాక్ బాక్సులను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి జూన్ 24వ తేదీన తరలించినట్లు తెలిపారు. ఫంట్, రియర్ బ్లాక్ బాక్సులు ప్రస్తుతం ఏఏఐబీ ల్యాబ్లో ఉన్నాయి.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!