
పాకిస్తాన్ తన సర్వశక్తులను కూడదీసుకుని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ఐసిఎంబి) తయారు చేసే పనిలో ఉంది. దాదాపుగా 5500 కిలోమీటర్ల దూరం వరకూ, అంటే అమెరికా వరకూ లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేయగల సామర్థం ఈ లాంగ్‌రేంజ్ అణు క్షిపణులకు ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనా మద్దతుతో పాక్ తన అణ్వాయుధ సామగ్రిని అప్‌గ్రేడ్ చేయాలని భావించింది.
అందుకు అనుగుణంగానే అత్యంత రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి చేపట్టినట్లు వాషింగ్టన్ నిఘా సంస్థలు ఓ నివేదికలో వెల్లడించాయి.కాగా, ఈ తరహా ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేయడం లేదా సమకూర్చుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని అమెరికా అధికారులు స్పష్టం చేసినట్లు సదరు నివేదిక పేర్కొంది.
“పాకిస్థాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం గానీ, కొనుగోలు చేయడం గానీ చేస్తే ఆ దేశాన్ని వాషింగ్టన్ అణ్వస్త్ర ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం లేదు. అలాంటి క్షిపణులను కలిగి ఉన్న ఏ ఇతర దేశాన్నీ మిత్రదేశంగా పరిగణించదు?అని అమెరికా అధికారులను ఊటంకిస్తూ సదరు నివేదిక పేర్కొంది.
కాగా, తమ దేశానికి ముప్పు కలిగించే అవకాశం ఉన్న లేదా అణ్వాయుధాలు కలిగిన ఏ దేశాన్నైనా అమెరికా తన ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. ఇప్పటికే రష్యా, చైనా, ఉత్తర కొరియాలను అమెరికా తమ శత్రు దేశాలుగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత రహస్య ప్రదేశంలో అణు ఆయుధ పాటవ శక్తితో ఉండే ఐసిబిఎం రూపకల్సనకు పాకిస్తాన్ దిగింది. దానితో ప్రత్యేకించి అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడు పాకిస్థాన్ వైఖరిపై మరింతగా నిఘా వేసేందుకు తగు ఆదేశాలు వెలువరించింది.
అమెరికా నెలకొని ఉన్న దూరం వరకూ లక్ష్యాలను ఛేదించగల పాటవ శక్తి క్షిపణులను సంతరించుకుంటే సదరు దేశం ఏదైనా అమెరికా మిత్ర దేశాల జాబితా నుంచి స్థానం కోల్పోవల్సి ఉంటుంది. అయితే తమ దేశపు అణు కార్యక్రమాలు అన్ని కూడా కేవలం ఆత్మరక్షణకు ప్రత్యేకించి భారత్ దూకుడును నిరోధించుకునేందుకే అని పాకిస్తాన్ తరచూ చెపుతూ వస్తోంది.
లాంగ్ రేంజ్‌మిస్సైల్స్ తమ ఆలోచనల్లో లేవని, కేవలం దగ్గరి దూరపు లక్ష్యాలు ఛేదించే మిస్సైల్స్ తయారీపైనే దృష్టి సారించామని పాక్ తెలియచేస్తోంది. అంటే కేవలం భారత్‌లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకోవడం లేదా దాడులను తిప్పికొట్టడం కోసం ఈ క్షిపణి తయారీ ఉంటుందని వెల్లడైంది. అయితే తమ వద్ద ఇప్పటికైతే ఐసిబిఎంలు లేవని పాక్ తెలిపింది.
ఇతరత్రా ఆర్థిక పరిస్థితులు , ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నా పాకిస్తాన్ తన యుద్ధ పాటవాన్ని పెంచుకుంటోంది. 2022లోనే పాకిస్థాన్ ఉపరితల, మధ్యస్థ శ్రేణి క్షిపణి షహీన్ 3 రూపొందించుకుంది. ఇది తమ స్థావరం నుంచి 2700 కిలోమీటర్ల దూరపు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్రమంలో అనుకుంటే భారత్‌లోని పలు ప్రధాన నగరాలను దెబ్బతీయగలదు. అయితే ఇప్పుడు ఇందుకు మరింత ముందడుగా ఖండాంతర క్షిపణి తయారీకి పాక్ సిద్ధం అయినట్లు వెల్లడికావడం సంచలనం అయింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం
జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలి
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం