
దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో సబర్బన్ రైల్వే వ్యవస్థ అత్యంత ప్రధానమైనవి. నిత్యం రద్దీగా ఉంటే ఈ రైళ్లు.. ఉదయం, సాయంత్రం వేళల్లో జనంతో కిక్కిరిసిపోతాయి. కనిసం నిలబడటానికి కూడా జాగా లేక ప్రజలు వేలాడబుతూ ప్రయాణాలు చేయడం సర్వసాదారణం. అయితే ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి.
మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికి పైగా రైలు ప్రమాదాల్లో మరణించారు. వారిలో 8,416 మంది బాధితులను ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2014 నుంచి 2024 వరకు ముంబై సబర్బన్ రైల్వే పరిధిలో మొత్తం 29,048 మంది మరణించాని ప్రభుత్వ రైల్వే పోలీసులు గణాంకాలు వెల్లడించాయి.
వీరిలో అత్యధికులు అంటే 15 వేల మందికి పైగా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక కిక్కిరిసిన రైళ్లలో వేలాడుతూ ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తు కిందపడి 6500 మంది చనిపోయారు. రైల్వే పట్టాలు దాటుతూ చనిపోయేవారే అధికంగా ఉంటున్నారని జీఆర్‌పీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కావడంతో బాధితులను గుర్తించడం కష్టసాధ్యమవుతున్నదని తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వేలో వెస్ట్రన్ లైన్, సెంట్రల్ లైన్, హార్బర్ లైన్ అనే మూడు ప్రధాన మార్గాలున్నాయి.
ఇవి నగరం నలుమూలలా ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. లోకల్ రైళ్లు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడుస్తాయి. కొన్ని మార్గాల్లో తెల్లవారుజామున 2.30 లేదా 3 గంటల వరకు కూడా సేవలు అందిస్తాయి. కాగా, సబర్బన్ రైల్వేలో అత్యంత పొడవైన మార్గం పన్వేల్ నుంచి దహాను రోడ్ వరకు ఉంది. ఈ రైల్వే లైను 131 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో 21 స్టాప్‌లు ఉంటాయి.
More Stories
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!
పంట వ్యర్థాల దహనంపై చర్యలు లేదా జైలు .. సుప్రీం
16 వేల మంది విదేశీయులు దేశం నుంచి బహిష్కరణ