
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక జాతీయ స్థాయి ప్రాంత ప్రచారక్ ల బైఠక్ ఈ సంవత్సరం ఢిల్లీలో జులై 4,5,6 తేదీలలో నిర్వహిస్తారు. ఢిల్లీలోని ‘కేశవ్ కుంజ్’ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయ భవనం సమావేశానికి వేదిక కానుంది. అన్ని ప్రాంత్ ప్రచారక్‌లు, సహ ప్రాంత్ ప్రచారక్‌లు, క్షేత్ర ప్రచారక్‌లు, సహ క్షేత్ర ప్రచారకులు ఈ సమావేశానికి హాజరవుతారని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణం ప్రకారం మొత్తం 11 క్షేత్రాలు, 46 ప్రాంత్ లు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత వివిధ సంస్థలకు చెందిన అఖిల భారతీయ సంఘటన్ కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మార్చి 2025 జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ తర్వాత, ఏప్రిల్, మే, జూన్‌లలో దేశవ్యాప్తంగా వివిధ స్థాయి శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
రాబోయే సంవత్సరానికి అమలు ప్రణాళికను చర్చించడానికి ఇది ఒక ముఖ్యమైన సమావేశంగా పరిగణిస్తామని అంబేకర్ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాలో ప్రధానంగా ఇటీవల ముగిసిన ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాల నివేదిక, సమీక్ష, రాబోయే సంవత్సరం పొడవునా ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సర కార్యక్రమాల అమలు వివరాలు, 2025-26 సంవత్సరానికి సర్ సంఘచాలక్ పర్యటన ప్రణాళికలు, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం (2025-26) కార్యక్రమాలు 2 అక్టోబర్ 2025న విజయదశమి నుండి ప్రారంభమమై, వచ్చే ఏడాది విజయదశమి 2026 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశానికి ప్రధానంగా సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, కార్యవాహ్ లు డాక్టర్ కృష్ణగోపాల్, సీఆర్ ముకుంద్, అరుణ్ కుమార్, రామదత్, అతుల్ లిమాయే, అలోక్ కుమార్ లతో సహా అన్ని శాఖాధిపతులు, కార్యకారిణి సభ్యులు హాజరవుతారు.
More Stories
నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు … ఇద్దరు ఎన్కౌంటర్
ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అభ్యర్థులకు ట్రంప్ ప్రచారం!
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం