ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం పర్యటిస్తున్న సైప్రస్ లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ని ప్రధాని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి ఈ అత్యున్న పురస్కారంను అందించారు.
ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3 అనేది సైప్రస్ మొదటి అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మకారియోస్ 3 పేరు మీద అందించే పురస్కారం. తమ దేశానికి చేసిన ప్రతిభావంతమైన సేవకు గుర్తింపుగా దేశాధినేతలు, ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. తనకు పురస్కారం అందించిన నికోస్ క్రిస్టోడౌలిడెస్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
“సైప్రెస్ అధ్యక్షులైన మీకు, మీ దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవం నా ఒక్కరిది మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులది. వారి సామర్థ్యాలు, ఆకాంక్షలకు గౌరవం లాంటిది. మా దేశ సాంస్కృతిక సోదరభావం, వసుధైవ కుటుంబం అనే సిద్ధాంతానికి గౌరవం వంటింది. ఈ పురస్కారాన్ని అత్యంత వినయం, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను” అని మోదీ తెలిపారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. “రాబోయే కాలంలో మన క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. రెండు దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా శాంతియుత, సురక్షితమైన ప్రపంచ వాతావరణాన్ని నిర్మించడంలో కూడా దోహదపడతాం” అని మోదీ చెప్పారు.
ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు “విశ్వసనీయ భారత్- సైప్రస్ స్నేహానికి, 1.4 బిలియన్ల భారతీయ ప్రజలకు అంకితం చేసిన అవార్డు. సైప్రెస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ని ప్రదానం చేశారు. ఈ గౌరవం రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని, కలిసి పనిచేయడానికి ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని తెలిపారు.
More Stories
సొంత ప్రజలపైనే బాంబులు వేసే దేశం పాకిస్తాన్
పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ పై ఐసీసీ చర్యలు
పదవి చేపట్టిన నెలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా