
ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూప్పకూలింది. గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ తో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణ కారణంగానే హెలికాప్టర్ కూలినట్టు భావిస్తున్నారు.
ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి. మురుగేశన్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారని తెలిపారు. సాంకేతికలోపం కారణంగానే ప్రమాదం జరిగిందని, క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని పేర్కొన్నారు. కేదారనాథ్ మందిరానికి భక్తులను దించిన తరువాత, ఆ విమానం తిరిగి అక్కడ భక్తులను ఎక్కించుకుని గౌరికుండకు బయలుదేరింది.
అయితే రుద్రప్రయాగ్ జిల్లాలోని త్రిజుగినారాయణ- గౌరికుండ మధ్య అదృశ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశం మారుమూల ప్రాంతం అని చెప్పారు. పోలీసు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరినట్టు వెల్లడించారు. కాగా, ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ యాత్రకు రెండు రోజులపాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
ఆరు వారాల్లో జరిగిన ఐదో ఘటన ఇది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలిన విషయంలో అత్యంత విచారకరమైన వార్త అందింది. ఎస్ డి ఆర్ ఎఫ్, స్థానిక పరిపాలన, ఇతర రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణికులందరి సురక్షితంగా ఉండాలని ఆ కేదార్‌నాథుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత నెలలోనూ కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూలిపోయింది. మే 8న కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ఉత్తర కాశీలోని గంగోత్రి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనంతపురం టీడీపీ ఎంపీ సోదరి కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందారు. వేదవతి భర్త భాస్కర్ గాయాలతో ప్రమాదం నుంచి గాయపడ్డారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ