
త్వరలోనే యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారం అని కేంద్రం కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం, వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన, తప్పుడు వార్తలు, నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవి అని పేర్కొంది.
మర్చంట్ టర్నోవర్ కంటే ట్రాన్సాక్షన్ విలువ ఆధారంగానే ఛార్జీలను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రూ.3 వేల కంటే ఎక్కువ ఉన్న అన్ని యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించే అవకాశం ఉందని, చిన్న మొత్తాలపై ఎలాంటి ఫీజులు ఉండవని వార్తలు వచ్చాయి.
అయితే, దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందిస్తూ ఎండీఆర్ వసూలు చేయబడుతుందనేది ఊహాగానాలు మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు పౌరుల్లో అనవసరమైన అనిశ్చితి, భయం, అనుమానాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రిత్వశాఖ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు యూపీఐ, రూపే లావాదేవీలపై అన్ని రకాల ఎండీఆర్ ఛార్జీలను ప్రభుత్వం 2022లో రద్దు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. తిరిగి యుపిఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటును తిరిగి ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు, ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవల విభాగం ఉన్నతాధికారుల మధ్య చర్చల దశలో జాతీయ మీడియాలో వార్తలు రావడంతో ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పందించింది.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ