
కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను కమల్ హాసన్ మరోసారి సమర్థించుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థగ్‌లైఫ్ సినిమా ప్రదర్శనను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా, కమల్ వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని సూచించింది.
అయితే, కమల్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. సినిమా ప్రదర్శనను కర్ణాటకలో నిలిపివేయడానికి అంగీకరించారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంటూ క్షమాపణలు చెప్పనంటూ హైకోర్టుకు తెలిపారు. తాను క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఫిల్మ్ చాంబర్‌తో చర్చలు జరిపేందుకు ప్రతిపాదించారు. థగ్‌లైఫ్ మూవీ జూన్ 5న విడుదల కానున్నది. థగ్‌లైఫ్ ఆడియో విడుదల సందర్భంగా కమల్ హసన్ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో థగ్‌లైఫ్ మూవీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిషేధించింది. ఈ క్రమంలో విశ్వనటుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని హైకోర్టు సూచించింది. నటుడి తరఫున సీనియర్ న్యాయవాది చిన్నప్ప వాదనలు వినిపించారు. అయితే, వ్యాఖ్యలపై కమల్ సమాధానాన్ని కోర్టుకు సమర్పించగా.. పరిశీలించిన కోర్టు క్షమాపణలు లేవని వ్యాఖ్యానించింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు