
వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
కొత్తగా బుధవారం దాదాపు 300 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,300 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 276 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,302కి పెరిగింది.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,373 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తర ప్రదేశ్‌లో 201 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో నాలుగు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 3,281 మంది డిశ్చార్జ్ అయ్యారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం