
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, పరాగ్వే సమష్టి పోరాటం సాగిస్తాయని, అలాగే సైబర్‌క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోడానికి కూడా సమష్టిగా పోరాటం సాగించే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగోపెనా పలాసియోస్‌తో ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగిన సందర్భంగా మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
“ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం, పరాగ్వే ఐక్యంగా ఉన్నాయి. సైబర్ నేరం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి సహకారం కోసం అపారమైన అవకాశం ఉంది” అని పెనాతో సమావేశంలో మోదీ తన ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. భారత్పరాగ్వే దేశాల మధ్య సంపూర్ణ సహకారం విస్తరించే ప్రయత్నంలో భాగంగా భారత్‌కు మూడు రోజుల పర్యటన కోసం పరాగ్వే అధ్యక్షుడు సోమవారం వచ్చారు.
లాటిన్ అమెరికా రీజియన్‌లో భారత్‌కు పరాగ్వే ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, రంగాల్లో అనేక భారతీయ కంపెనీలు పరాగ్వేలో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ, కీలకమైన ఖనిజాలు, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యభద్రత, రైల్వేలు, అంతరిక్ష పరిశోధన, ఆర్థిక రంగాల్లో కూడా సహకారంతో కొత్త అవకాశాలు తాము చూస్తామని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. సౌత్ అమెరికన్ వాణిజ్య కూటమి (అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు)కి ప్రాధాన్యమైన వాణిజ్యం నెరవేరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పహల్గా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు సమష్టిగా పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నారు. గ్లోబల్ సౌత్‌లో భారత్, పరాగ్వే సమగ్రమైన భాగాలుగా మోదీ అభివర్ణించారు. ఈ రెండు దేశాల ఆశలు, అభిప్రాయాలు, సవాళ్లు ఒకటేనని, అందువల్ల ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఒకరి అనుభవాలు మరొకరు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ తన వ్యాక్సిన్లను పరాగ్వేకు అందజేసిందని చెప్పారు.
More Stories
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ