
“జూన్ 6న వెలువడే ద్రవ్య పరపతి విధాన కమిటీ ప్రకటనలో 50 బేసిస్ పాయింట్ల రేటు కోత ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే పెద్ద రేటు కోత క్రెడిట్ సైకిల్ ను తిరిగి ఉత్తేజపరుస్తుంది. దేశీయ ద్రవ్యత, ఆర్థిక స్థిరత్వ ఆందోళనలు తగ్గాయి. ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ అంచనాలకు తగ్గట్లే ఉంది” అని తెలిపింది.
“దీనిని దృష్టిలో ఉంచుకుని వృద్ధి వేగాన్ని కొనసాగించాలి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనా వేయడం, పంటలు బాగా పండడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి ఇతర సానుకూల పరిణామాలు దేశంలో ఉన్నాయి. ఈ కారణాలు ఎస్ బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరానికి దాని సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి సవరించడానికి దారితీసింది” అని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది.
ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 8.4 శాతంగా ఉంది. ఈ వృద్ధికి మూలధన నిర్మాణంలో బలమైన పెరుగుదలే ప్రధాన కారణం. కాగా, బ్యాంకులు ఇప్పటికే పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 2.70 శాతం ఫ్లోర్ రేటుకు తగ్గించాయి. అదనంగా 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. రాబోయే త్రైమాసికాల్లో డిపాజిట్లకు రేటు కోతల బదిలీ బలంగా ఉంటుందని ఎస్ బీఐ నివేదిక అంచనా వేసింది.
కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జూన్ 4న మొదలవ్వనుంది. జూన్ 6న (శుక్రవారం) ఎంపీసీ నిర్ణయాలను ఆర్ బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.25శాతం, ఏప్రిల్ లో 0.25 శాతం చొప్పున మొత్తంగా కీలక రెపో రేటును అరశాతం మేర తగ్గిస్తూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ రెపో రేటు తగ్గించనుందని ఎస్ బీఐ అంచనా వేస్తోంది. ఒకవేళ రెపో రేటు తగ్గితే ఈఎంఐ కట్టేవాళ్లకు ఉపశమనం కలిగించినట్లు అవుతుంది
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు