
మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించారు. అలాగే వందల మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంకోవైపు మావోయిస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేంద్రం ఇటీవల విడుదల చేసింది. గతంలో కంటే మావోయిస్టుల హింస దాదాపుగా అంటే.. పూర్తిగా తగ్గిపోయిందని తెలిపింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని వివరించింది. అంటే దాదాపు 81 శాతం మేర మావోయిస్టుల హింస తగ్గిందని సోదాహరణగా వివరించింది.
అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126గా ఉంటే, వి 2021 నాటికి 70, ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి అవి 18కి పరిమితమైనాయని గణాంకాలతో సహా సోదాహరణగా వివరించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే, 2019కి ఆ సంఖ 150కి చేరిందని, ఇక 2023లో 106, 2024లో 131, ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని కేంద్రం గణాంకాలతో సహా వివరించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్