
ఉత్తర భారతదేశంలో అత్యంత అతీంద్రియ స్వర్ణ ఆలయంగా నిర్మించారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించిన అన్ని పరికరాలను తొలగించే పని జరుగుతోందని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా వెల్లడించారు.
“జూన్ 5వ తేదీన జరగనున్న రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ సమయంలో వీఐపీ పాస్లు రద్దు చేశారు. ఆ రోజున రామ దర్బార్తో సహా ప్రాంగణంలోని దేవతల విగ్రహాల ప్రాణప్రతిష్ఠ పూర్తవుతుంది. ప్రాణ ప్రతిష్ట కోసం వేద ఆచార్యులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. సన్నాహాలు పూర్తయ్యాయి” అని డా. అనిల్ మిశ్రా తెలిపారు.
జూన్ 5న దర్శన సమయాన్ని పరిమితం చేయవచ్చు. మూడు రోజుల పాటు ఆచారాలు జరుగుతున్న భక్తులు రామాలయాన్ని సందర్శించవచ్చని చెప్పారు. రామాలయంలో రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జూన్ 2వ తేదీన కలశ యాత్రతో ప్రారంభమవుతుంది. 108 కలశాలతో పవిత్ర సరయూ నీటితో పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు.
ఆ కలశాన్నింటినీ పూజిస్తారు. జూన్ 3 నుంచి అయోధ్య రామమందిరంలో మూడు రోజులపాటు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. 101 మంది వేద ఆచార్యులతో రామ దర్బార్లో దేవతా విగ్రహాలను జూన్ 5న ప్రతిష్ఠించనున్నారు. గత ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా వచ్చారు. కానీ ఇప్పుడు రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ మాత్రం సాధారణంగానే జరగనుంది. వీఐపీలను ఆహాన్వించడం లేదు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్