మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. సుచాత థాయ్‌లాండ్‌లోని ఫుకెట్లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. శనివారం నగరంలోని హైటెక్స్ వేదికగా సుందరీమణుల ర్యాంప్ వాక్‌తో ప్రపంచ అందగత్తెల సంబురం అంబరాన్నంటింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడ్డారు.
చివరిగా 72వ మిస్ వరల్డ్ విజేతగా ఆసియా ఖండం నుంచి థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ నిలిచి ప్రపంచ సుందరి పోటీల చివరి ఘట్టానికి ముగింపు పలికారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్లు ఆకట్టుకున్నారు. మిస్‌వరల్డ్-72 పోటీల్లో ప్రారంభం నుంచి ప్రతిభను చూపుతున్న మిస్ ఇండియా నందిని గుప్తా చివరి అంకంలో తడబడింది. టాప్ 10 వరకు బరిలో నిలిచిన ఆమె టాప్-8 నుంచి నిష్క్రమించింది. టాప్- 8 లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన సుందరీమణులు ఉన్నారు.
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్‌శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్‌ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్‌లాండ్ నుంచి తొలిసారిగా మిస్ వరల్డ్ టైటిల్‌ను సాధించిన బ్యూటీగా నిలిచింది ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ. 21 సంవత్సరాల వయసులో మిస్ వరల్డ్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.
ఓపల్ 20 మార్చి 2003న ఫుకెట్ నగరంలో జన్మించిన సుచత చువాంగ్‌శ్రీ బ్యాంకాక్‌లోని త్రియం ఉదోమ్ సుక్సా పాఠశాలలో చదువుకుంది. థాయ్, ఇంగ్లీష్‌తోపాటు చైనీస్ భాషలోనూ ప్రావీణ్యం ఉన్నది. వివిధ దేశాల సంస్కృతీ, సంప్రదాయాలపై మక్కువ పెంచుకుంది. ప్రస్తుతం థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నది. అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి పెట్టారు.
అయితే, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్, అందాల పోటీల్లో ఆసక్తితో.. 2021లో ‘మిస్ రత్తనకోసిన్’ పోటీల ఆడిషన్స్‌లో పాల్గొంది. అయితే, అందులో పాల్గొనేందుకు అవకాశం రాకపోయినా.. అధైర్యపడకుండా ప్రయత్నాలు చేసింది. సుచాత 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది. అది క్యాన్సర్ కాదని, ప్రమాదం ఏమీ లేదని తేలడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.
భవిష్యత్‌లో క్యాన్సర్‌గా మారకుండా ఉండేందుకు కణితిని తొలగించినా క్యాన్సర్‌తో బాధపడే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న సుచాత మదిలో అప్పుడే మొదలైంది. దాంతో క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని ‘ఓపల్ ఫర్ హెర్’ అనే ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ వస్తున్నది. తొలి దశలోనే క్యాన్సర్‌ని గుర్తించేలా చేయడం ఈ ప్రాజెక్టు కీలక ఉద్దేశం. బాధితులకు అండగా నిలిచేందుకు నిధులు సేకరించడంతో పాటు పలు సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!