
“ఉగ్రవాదాన్ని పోషించడం ఖర్చుతో కూడుకున్నది కాదు. అయితే దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో కూడా ఈరోజు పాకిస్థాన్‌కు తెలిసివచ్చింది. ఉగ్రవాదంపై వ్యూహాన్ని, ప్రతిస్పందించే విధానాన్ని భారత్ పునఃరూపకల్పన చేశాం. పాకిస్తాన్‌తో మన సంబంధాలు, చర్చల పరిధిపై కొత్త అంచనాలు వేసుకున్నాము. ఇప్పుడు చర్చలంటూ ఉంటే అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలపైన” అని రక్షణ మంత్రి తేల్చి చెప్పారు.
పీవోకేలో ఉన్న ప్రజలు భారత్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పచ్చుకున్నట్లు చెప్పారు. కొందరు మాత్రం వాళ్లను తప్పుదోవ పట్టించారని చెబుతూ ప్రేమ, ఐక్యత, సత్యంపై నడిస్తే, పీవోకే మనతో కలిసే రోజు ఎంతో దూరం లేదని స్పష్టం చేశారు. నేను భారతీయుడిని, తిరిగి వచ్చేశానని పీవోకే ప్రజలు చెప్పుకుంటారని పేర్కొన్నారు. పీవోకేలోని మెజారిటీ ప్రజలు భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారని చెబుతూ అయితే కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని చెప్పుకొచ్చారు. మనం ఏదైనా చేయగలమని, అయినప్పటికీ శక్తితో పాటు సంయమనం కూడా చాలా అవసరమని రాజ్‌నాథ్ హితవు చెప్పారు.
“పీవోకేలోని ప్రజలు మనవారే, మన కుటుంబంలోని భాగమే అని నేను నమ్ముతున్నాను. ప్రధాని మోదీ చెబుతున్న “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” సంకల్పానికి కట్టుబడి ఉన్నాము. భౌగోళిక, రాజకీయ కారణాలతో మన నుంచి విడిపోయిన మన సోదరులు కూడా ఏదో ఒక రోజు వారి ఆత్మ చెప్పే మాటలు విని భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
స్వదేశీ ఆయుధ రక్షణ సామర్థ్యం భారీగా పెరిగిందని రక్షణ మంత్రి తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కేవలం వెయ్యికోట్లే ఉండేవనని చెబుతూ ఇప్పుడు అది రూ.23,500 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. భారతదేశ భద్రత కోసం రక్షణ రంగంలో మేకిన్-ఇండియా ఎంతో అవసరమని ఇప్పుడు తెలుస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ప్రస్తుతం ఫైటర్ జెట్‌లను లేదా క్షిపణి వ్యవస్థలను నిర్మించడమే కాకుండా భవిష్యత్ యుద్ధ సాంకేతికతలో కూడా ముందడుగు వేస్తున్నామని వివరించారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము