
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులు – 2024 ప్రకటించింది. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ విజేతలను ప్రకటించారు. అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం లేకుండా పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారని, జ్యూరీ ఏకగ్రీవంగా విజేతలను ఎంపిక చేసిందని జయసుధ తెలిపారు. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్(కల్కి), ఉత్తమ హీరోగా అల్లు అర్జున్(పుష్ప-2), ఉత్తమ నటి నివేదా థామస్(35) దక్కించుకున్నారు. ఉత్తమ బాలల చిత్రంగా ’35’ నిలిచింది. ఉత్తమ చిత్రాలలో పొట్టేల్, లక్కీ భాస్కర్ రెండు, మూడు స్థానాలలో నిలిచాయి.
ఉత్తమ సహాయ నటులుగా ఎస్జే సూర్య, శరణ్య ప్రదీప్, ఉత్తమ కమెడియన్లుగా వెన్నెల కిశోర్, సత్య సెలక్ట్ అయ్యారు. జ్యూరీ విభాగంలో దుల్కర్ సల్మాన్, అనన్య నాగళ్ల ఎంపికయ్యారు. మొత్తం 11 కేటగిరీల్లో ఈ అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఒక ఉత్తమ చిత్రానికి ఈ అవార్డులను ఇచ్చేవారు. ఆ సంవత్సరాలలో రిలీజ్ అయిన సెన్సార్ చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024 తర్వాత సంబంధించి అన్ని కేటగిరిల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు సినిమాలతో పాటుగా ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు.
2024 ఉత్తమ చిత్రాలు
- మొదటి ఉత్తమ ఫీచర్ చిత్రం: కల్కి 2898ఏడీ
- రెండో ఉత్తమ ఫీచర్ చిత్రం: పొట్టేల్
- మూడో ఉత్తమ ఫీచర్ చిత్రం: లక్కీ భాస్కర్
- ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
- హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్
- ఉత్తమ పరిచయ దర్శకుడు: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
వ్యక్తిగత విభాగాల్లో
- ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
- ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2-సూసేకి అగ్గిరవ్వ)
- ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
- ఉత్తమ బాలనటుడు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
- ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
- ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
- ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డులు
- నటుడు- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- నటి- అనన్య నాగళ్ల (పొట్టేల్)
- దర్శకులు- సుజీత్, సందీప్ (క)
- నిర్మాతలు- ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజు యాదవ్)
- స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
- తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: ‘మన సినిమా ఫస్ట్ రీల్’ (రెంటాల జయదేవ్)
- ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)
- ఉత్తమ నటి – నివేదా థామస్(35 ఇది చిన్న కథకాదు)
- ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ సహాయనటుడు – ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
- ఉత్తమ సహాయనటి – శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్(రజాకార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
- ఉత్తమ నేపథ్యగాయని – శ్రేయా ఘోషల్(పుష్ప 2)
- ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజూ యాదవ్)
- మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – కల్కి
- రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – పొట్టేల్
- మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
ముస్లింలు, ఆర్ఎస్ఎస్ : వ్యక్తిగత స్మృతులు
చిన్న పార్టీలే బీహార్ విజేత నిర్ణేతలు