వరికి క్వింటాల్‌కు రూ.69 మద్దతు ధర పెంపు

వరికి క్వింటాల్‌కు రూ.69 మద్దతు ధర పెంపు
 
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. కనీస మద్దతు ధరను 50 శాతం పెంచింది. కేబినెట్‌ సమావేశం అనంతరం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.  గత పది పదకొండేళ్లలో ఖరీప్‌ పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెరిగిందని చెప్పారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు ఎమ్మెస్పీ పెంపునకు ఆమోదం చెప్పింది.
2025-26 ఖరీఫ్ సీజన్‌కు వరికి క్వింటాల్‌కు రూ.69 మద్దతు పెంచింది. తాజాగా పెంపుతో రూ.2,369 పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కేటాయించినట్లు పేర్కొన్నారు.  జొన్నలు క్వింటాల్‌కు రూ.328, సజ్జలు క్వింటాల్‌కు రూ.150, రాగులు క్వింటాల్‌ రూ.596, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.175 పెంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. కందిపప్పు క్వింటాల్‌కు రూ.450, పెసర్లు క్వింటాల్‌కి రూ.86, మినుములు క్వింటాల్‌ రూ.400, వేరుశెనగ క్వింటాల్‌ రూ.480 పెంచినట్లు వివరించారు.

పొద్దుతిరుగుడు క్వింటాల్ రూ.441, సోయాబీన్ క్వింటా రూ.436, కుసుములు క్వింటా రూ.579, వలిసెలు క్వింటాల్‌కి రూ.820, పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంపు, నువ్వులు క్వింటాల్‌కు రూ.579 పెంచినట్లు చెప్పారు. అలాగే, బద్వేల్‌-నెల్లూరు నాలుగు వరుసల రోడ్డుకు రూ.3,653 కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ – కృష్ణపట్నం ఓడరేవుకు, హెచ్‌హెచ్‌67లోని ఓ భాగానికి ఓడరేవు కనెక్టివిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పారిశ్రామిక కారిడార్ల కలుపనున్నది. దాదాపు సుమారు 108 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం జరుగనుండగా  వార్దా-బల్లార్షా నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.