
ఆయనతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. అయితే భద్రతా దళాలు సంబాలతో సహా 27 మందినే చంపినట్లు పేర్కొనడం గమనార్హం. మరో వృతదేహాన్ని మావోస్టులు తీసుకెళ్ళరా? అనే అనుమానం కలుగుతుంది. “మే 19న నంబాల ఉన్న సమీప గ్రామానికి పోలీసు బృందం చేరుకుందని సమాచారం అందిన తర్వాత ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బయలుదేరాం. 19వ తేదీ ఉదయం నుంచి ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి కానీ ఎటువంటి నష్టం జరగలేదు” అని వికల్ప తెలిపారు.
“మే 20 రాత్రి వేలాది మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. 60 గంటల పాటు భద్రత దళాలు నిర్భంధించాయి. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదు. ముందుండి మమ్మల్ని నడిపించారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు” అని వివరించారు.
“నా గురించి కాదు. యువ నాయకత్వం గురించి ఆలోచించండి. నా భద్రత కంటే విప్లవంలోని యువకుల భద్రత ముఖ్యం. మనం చనిపోయినా కూడా ఉద్యమం కొనసాగాలి. ఎప్పటికీ ఉద్యమం బలహీనంగా మారకూడదు. ఈ త్యాగాల స్ఫూర్తితో విప్లవం పునర్నిర్మించబడుతుందని నేను నమ్ముతున్నాను” అన్నవే కేశవరావు చివరి మాటలు అని చెప్పారు.
“మే 21న జరిగిన ఆపరేషన్‌లో నంబాలతో పాటు 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు” అని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తాము కోరితే పట్టించుకోలేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆరు నెలలుగా కేశవరావు జాడను పసిసగడుతున్నారని, ఆయన తమను ముందుండి నడిపించారని ఆ లేఖలో తెలిపారు. దాడులు జరుగుతాయని తెలిసినా కూడా నంబాల చెప్పినట్లు శాంతియుత చర్చల కోసం ఎదురుచూసినట్లు చెప్పారు. అందుకోసం 40 రోజులుగా ఎటువంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. అయినా ప్రభుత్వ బలగాలు దాడులకు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు