 
                భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా పాకిస్తాన్ గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, రాజస్థాన్‌లోని డీగ్ ప్రాంతానికి చెందిన ఖాసిం(32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఆ సమయంలో ఖాసీం పాకిస్తాన్ లోని కొంతమందితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పాకిస్థాన్ లో కూడా అతడు పర్యటించినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. నిందితుడికి సంబంధించిన ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాసిం పాకిస్థాన్‌కు చేసిన కాల్స్లో కొన్ని సంభాషణలు అనుమానాస్పదంగా ఉండటం వల్ల అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కోసం ఖాసింను జైపుర్కు తరలించారు. మిలిటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఆరోపణలతో గుజరాత్లోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కచ్లోని దయాపర్కు చెందిన సహదేవ్ సింగ్ గోహిల్, కాంట్రాక్ట్ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, 2023లో అదితి భరద్వాజ్ పేరుతో పాకిస్థాన్ మహిళ ఏజెంట్తో గోహిల్కు పరిచయమైంది.
ఇద్దరి మధ్య తరచూ చాటింగ్లు జరిగేవి. ఈ క్రమంలో గోహిల్ తన ఆధార్ కార్డుతో తీసుకున్న సిమ్ల ఓటీపీలను ఆమెకు పంపాడు. దీంతో పాకిస్థాన్ నుంచి ఆ నంబర్లతో వాట్సాప్ చాటింగ్ చేసేది. ఆ తర్వాత ఆమె కోరిన విధంగా గుజరాత్లోని బీఎస్ఎప్, నేవీకు సంబంధించిన కీలక సమాచారాన్ని, ఫొటోలను షేర్ చేశాడు. బదులుగా రూ.40 వేల నగదును తీసుకున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గోహిల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గోహిల్తో పాటు పాక్ ఏజెంట్ అదితి భరద్వాజ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడని ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి చెందిన తుఫైల్ అనే వ్యక్తిని యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
పాకిస్తాన్ లోని పలు వ్యక్తులు, సంస్థలతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్నాడని చెప్పారు. అంతేకాకుండా యువతను రెచ్చగొట్టే విధంగా సందేశాలు ఉన్నాయని తెలిపారు. వారణాసిలోని రాజ్‌ఘాట్, నమోఘాట్, జ్ఞానవాపి మసీదు, రైల్వే స్టేషన్, జామా మసీదు వంటి కీలక ప్రదేశాల ఫొటోలను పాక్ వ్యక్తులకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన సుమారు 600 మందితో సంబంధాలున్నాయని తెలిపారు.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం