
కాళేశ్వరం త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంది. సోమవారంతో పుష్కర స్నానాలు ముగియనున్నాయి. ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఆదివారం నలుమూల నుంచి భక్తులు రాక తెల్లవారు జాము నుంచే ప్రారంభమైంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనులు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వాహనాలు వేసుకుని రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 15 కిలో మీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారికంగా ఇదే తొలిసారి కావడంత శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతున్నా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు చేయడం ఇదే తొలిసారి.
ఉత్తరాది ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సంప్రాదాయానికి శ్రీకారం చుట్టినట్టయింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాలు కోసం దేశం నలుమూలల భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో ఆదివారం పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగంమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రతి రోజు వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం జనమయం అవుతోంది. నది తీరంలో సందడిసరస్వతి నదిలో ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానాలు చేస్తున్నారు. అలాగే స్నానం అనంతరం త్రివేణి సంగమానికి చీరె సారె సమర్పిస్తున్నారు. సైకత లింగాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు.
పిండ ప్రదానం, పెద్దలకు తర్పణాలు ఇవ్వడంతో వివిధ సంప్రదాయం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పురోహితులు, వేదపండితులు ఈ తంతును నిర్వహిస్తున్నారు. దీంతో ఒక వైపు తర్పణాలు ఇవ్వడానికి భక్తులు, పిండ ప్రదానం చేయడానికి పురుషులు, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పురోహితులు, అర్చకులు ఇలా నదీ తీరంలో సందడి నెలకొంటోంది.
అలాగే పూజ సామగ్రి అమ్మకాలు, పిండ ప్రదాన సామాగ్రి అమ్మకాలతో వ్యాపారులు బిజీగా ఉన్నారు. కన్నుల పండువగా నవరత్న హారతిసరస్వతి పుష్కరాల నేపథ్యంలో భక్తులను ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది నవరత్న హారతి. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ హారతి నిలుస్తోంది. త్రివేణి సంగమంలో నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతిని నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను రప్పించారు. కాశీ పూజారులు పుష్కరాలు ప్రారంభం రోజు రాత్రి నుండి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండటంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగిలిన ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం ఉంది. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అవసరమైన ఏర్పాట్లు చేశారు.
రోజూ రాత్రి గంటకు పైగా నిర్వహించే హారతిని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి ప్రాధాన్యం ఏమటో భక్తులకు సరస్వతి నదీ పుష్కరాలు ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. తెల్లవారుజామున నుండే భక్తుల రద్దీ పెరిగి, పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం చేరుకుంటూ పుష్కర స్నానాలను ఆచరించారు.
కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లే వాహనాలు భారీగా వస్తుండడంతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్నారం క్రాస్ నుండి మద్దులపల్లి మీదుగా వెళ్లే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ప్రయాణికులు గంటలు తరబడి వేచి ఉన్నారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు