
* పుతిన్‌కు పిచ్చి పట్టిందా?… ట్రంప్
అయితే తమ దళాలు 46 యూఏవీలను కూల్చినట్లు రష్యా కమాండర్ పేర్కొన్నారు. డ్రోన్ల దాడి సయమంలో తమ వైమానిక రక్షణ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ కంబాట్ విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రెసిడెంట్ హెలికాప్టర్ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. శత్రు డ్రోన్లను తిప్పికొట్టామని, ఏరియల్ టార్గెట్లను పేల్చివేసినట్లు దాస్కిన్ తెలిపారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు సుమారు 764 ఉక్రెయిన్ డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా పేర్కొన్నది. శనివారం, ఆదివారం కూడా వందల సంఖ్యలో మానవరహిత వైమానిక వాహనాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ దేశాల సహకారంతో రష్యాపై దాడులకు ఉక్రెయిన్ తెగిస్తున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.
మరోవంక, ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించడం పట్ల అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని, ఉక్రెయిన్‌లో అమాయక పౌరులను చంపేస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా పతనానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.
రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ తనకు మంచి స్నేహితుడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ అలాంటి అతడికి ఏదో అయిందని, పూర్తిగా పిచ్చివాడిగా మారారని ఆక్షేపించారు. చాలా మందిని అనవసరంగా అతడు చంపుతున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను సైనికుల గురించి మాట్లాడడం లేదని, అనవసరంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడు చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అదీకాక ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని పుతిన్ కోరుకోవడం లేదని.. అతడు ఆ దేశం మొత్తాన్ని కోరుకుంటున్నాడని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇక ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జోలెన్‌స్కీపై సైతం డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇన్ని అనర్థాలకు జోలెన్‌స్కీ నోరే కారణమని ఆయన చెబుతూ అతడు వ్యాఖల వల్లే ఈ తరహా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు