ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం

ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో వడ్డీ రేటును 8.25శాతం వద్దనే కొనసాగించాలని నిర్ణయించింది.  అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీరేటు చెల్లించారు. 

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ అధ్యక్షతన ఫిబ్రవరి 28న దిల్లీలో జరిగిన ఈపీఎఫ్​వో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ 237వ సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నారు. 8.25 శాతం వడ్డీ రేటును నిలుపుకోవాలని ​నిర్ణయించారు. అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపారు. ఇప్పుడు కేంద్రం ఈపీఎఫ్‌ వడ్డీరేటు నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ కానుంది.

అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 0.10శాతం పెంచి 8.15శాతానికి పెంచిన విషయం తెలిసిందే. 2022-23లో 0.05శాతం పెంచి 8.10శాతం నుంచి 8.15శాతానికి పెంచింది. 2022లో ఈపీఎఫ్‌వో ఏడుకోట్ల మందికిపైగా చందాదారుల కోసం 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీని నాలుగు దశాబ్దాలకుపైగా 8.1శాతానికి తగ్గించింది. 

ఈ వడ్డీ రేటు 2020-21లో 8.5 శాతంగా ఉంది. అంతకుముందు 2020-21 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.10 శాతం వడ్డీ రేటు ఉండగా.. 1977-78 తర్వాత ఇదే అత్యల్పం. ఆ సమయంలో ఈపీఎఫ్‌ వడ్డీ రేటు కేవలం ఎనిమిది శాతం మాత్రమే. అయితే, ఈపీఎఫ్‌వో 2019-20కి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయి 8.5 శాతానికి తగ్గించింది. ఇది 2018-19లో 8.65 శాతంగా ఉన్నది.

ఈపీఎఫ్‌వో చందాదారులకు 2016-17లో 8.65 శాతం వడ్డీ రేటును, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది.  వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంది. 2015-16లో 8.8 శాతం చెల్లించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ 2013-14.. 2014-15లో 8.75 శాతం వడ్డీని ఇచ్చింది. ఇది 2012-13లో 8.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2011-12 సంవత్సరంలో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉన్నది.