పహల్గాం ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘పాకిస్థాన్..’ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది. ఆ పేరు వినడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఓ మిఠాయి దుకాణం యజమాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దుకాణంలో ‘పాక్’ పేరుతో ఉన్న మిఠాయిలకు పేర్లు మార్చేశారు.
మైసూర్‘పాక్’ సహా వివిధ స్వీట్ల పేర్లను మార్చేశారు. తన దుకాణంలోని ‘పాక్’ పేరుతో ఉన్న స్వీట్ల పేర్ల స్థానంలో ‘శ్రీ’ని చేర్చారు. మైసూర్‘పాక్’ని మైసూర్‌శ్రీగా, మోతీ‘పాక్’ని మోతీశ్రీగా, గోండ్‌పాక్‌ని గోండ్‌శ్రీగా ఇలా పేరు మార్చినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఈ సందర్భంగా అంజలీ మాట్లాడుతూ సరిహద్దులోనే దేశభక్త ఉంటే సరిపోదు అని, ప్రతీ భారతీయుడికి దేశంపై ప్రేమ ఉండాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వాస్తవానికి ‘పాక్’ అంటే సంస్కృతంలో ‘పండటం’ అని అర్థం. చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కొన్ని భాషల్లో ‘పాకం’ అంటారు. దీనికి పాకిస్థాన్‌తో సంబంధం లేనప్పటికీ.. శబ్ధం ఆ దేశాన్ని గుర్తు తెచ్చేలా ఉంటడంతో పేరు మార్చామని ‘శ్రీ’ అనే పదం శుభాన్ని సూచిస్తుందని అంజలీ జైన్ వివరించారు. స్వీట్స్‌లోని ‘పాక్’పదం కన్నడలో తీపి అని అర్థం. అయితే, ప్రస్తుతం భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు దుకాణదారుడు పేర్కొన్నారు.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం