గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామన్న ఇజ్రాయిల్ 

గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామన్న ఇజ్రాయిల్ 
గాజాస్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామ‌ని ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ ప్రకటిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. గాజాస్ట్రిప్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వ‌ర‌కు ఇజ్రాయిల్ వెనుక‌డుగు వేయ‌బోద‌ని  ఆయన స్పష్టం చేశారు. గాజాస్ట్రిప్ వ‌ద్ద భీక‌ర పోరు సాగుతోంద‌ని, దాంట్లో ప్ర‌గ‌తి సాధిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గాజాస్ట్రిప్ ఏరియాను పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకుంటామ‌ని పేర్కొంటూ విజ‌యం సాధించాలంటే ఆ దిశ‌గానే ప్ర‌య‌త్నాలు సాగించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. 
ఆదివారం గాజాపై ఇజ్రాయిల్ భీక‌ర దాడులు చేసింది. ఆ దాడుల్లో సుమారు 103 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో నార్త‌ర్న్ గాజాలో ఉన్న ఆస్ప‌త్రిని మూసివేశారు. 
హ‌మాస్ మిలిటెంట్ గ్రూపుపై వ‌త్తిడి పెంచుతున్న‌ట్లు నెత‌న‌హ్యూ తెలిపారు. వేల సంఖ్య‌లో రిజ‌ర్వ్ సైనికులను ర‌ప్పిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ చీఫ్ వెల్ల‌డించారు. గాజాలోకి స్వ‌ల్ప స్థాయిలో ఆహార ప‌దార్ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఇజ్రాయిల్ చెప్పింది. దాదాపు 11 వారాల పాటు ఉన్న నిషేధంతో గాజాలో తీవ్ర దుర్భిక్ష ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.ఆహార కొర‌త ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌కు యూఎన్ స్పందించింది. గాజాస్ట్రిప్ ప్రాంతంలోకి ఆహారాన్ని పంపే విష‌యంపై ఇజ్రాయిల్‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు యూఎన్ పేర్కొన్న‌ది. ఖాన్ యూనిస్ ప్రాంత నివాస‌ల‌ను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. శ‌ని, ఆదివారాల్లో జ‌రిగిన దాడ‌ల్లో వంద‌ల మంది చ‌నిపోయార‌ని, దాంట్లో డ‌జ‌న్ల సంఖ్య‌లో పిల్ల‌లు ఉన్న‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హ‌మాస్ చెర‌లో ఉన్న బంధీల‌ను విడిపించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు ఇజ్రాయిల్ చెప్పింది.