
* జ్యోతి ఇన్‌స్టా ఖాతా సస్పెండ్
భారతీయ సైన్యంపై చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఆమె బంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ మేరకు కోల్‌కతా పోలీస్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, వివిధ జిల్లాలో పోలీసులు బంగాల్లో జ్యోతి అడుగుజాడల గురించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బంగాల్లో ఉన్నప్పుడు జ్యోతి తిరిగిన ప్రదేశాల గురించి కోల్‌కతా పోలీసులకు హరియాణా పోలీసులు సమాచారం అందించారు. ఆమె బంగాల్‌కు వచ్చి పలు జిల్లాలను సందర్శించినట్లు తమకు సమచారం ఉందని ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి తెలిపారు.
ఇలాంటివి జరిగినప్పుడల్లా ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. జ్యోతి తన పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని వివిధ జనసాంద్రత గల ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ యూట్యూబర్ సీల్దా స్టేషన్ నుంచి రైలు ప్రయాణం వీడియోను కూడా తీసింది. అంతేకాకుండా, ఉత్తర24 పరగణాల జిల్లా బరాక్‌పుర్‌లోని ఒక ప్రసిద్ధ బిర్యానీ అవుట్‌లెట్‌ను సందర్శించి అక్కడ వీడియోలను చిత్రీకరించింది.
హుగ్లీ జిల్లాలోని షియోరాఫులిలో జ్యోతి మల్హోత్రా ఓ వివాహ వేడుకకు హజరైనట్లు ఎస్టిఎఫ్ అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి కొన్ని నెలల క్రితం సిలిగుడిని సందర్శించిందని పోలీసులకు తెలిసింది. కాగా, భూటాన్‌కు వెళ్లడానికి డిల్లీ నుంచి విమానంలో బాగ్డోగ్రాకు చేరుకున్నానని, సిలిగుడిలోని ఒక హోటల్లో బస చేశానని జ్యోతి తన యూట్యూబ్ వ్లాగ్‌లో పేర్కొంది.
అయితే, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, జ్యోతి తిరిగిన కోల్‌కతా, బరాక్పుర్, సిలిగుడిలో ప్రధాన రక్షణ స్థావరాలు ఉన్నాయి. కోల్‌కతాలో ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. బరాక్పుర్లో అనేక ప్రాంతాలు రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది.
బాగ్డోగ్రా, హసిమారా రెండింటిలోనూ వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి. అలా సిలిగుడి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. మూడు మౌంటేన్ డివిజన్స్ కలిగి ఉన్న 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయం సిలిగుడికి దగ్గరగా ఉన్న సుక్నాలో ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం, యూట్యూబర్ జ్యోతి కొన్ని నెలల క్రితం మరో మహిళా యూట్యూబర్‌తో కలిసి పూరీలోని జగన్నాథ్ ధామ్, కోణార్క్ సూర్య దేవాలయం సహా అనేక దేవాలయాల వీడియోలను చిత్రీకరించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ అయ్యింది. ఆమె ఖాతాను మెటా బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టా ఖాతా బ్లాక్ అయినప్పటికీ ఆమె యూట్యూబ్ ఛానల్ మాత్రం అందుబాటులోనే ఉంది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు.
అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా ర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్లింది. ఈమె ఈ ఏడాది జనవరిలో కశ్మీర్‌లోని పహల్గాం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మూడు నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఐదు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు