
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ ఆసియాలోని రెండు దేశాల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు.
ఇటీవల శాంపిల్స్‌లో అనేకం పాజిటివ్‌గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కరోనా మరణాలు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని కూడా తెలిపారు. రెండేళ్ల నాటి కరోనా ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.అటు సింగపూర్ కూడా కరోనా పెరుగుదలతో అప్రమత్తమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కరోనా కేసుల సంఖ్యపై సింగపూర్ సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28 శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేసుకున్నట్లున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగినట్లు సమాచారం.
థాయ్‌లాండ్, చైనా దేశాల్లోనూ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కేసుల పెరుగుదలతో ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
More Stories
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్