
హైదరాబాద్ లో మెట్రో రైలు చార్జీల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చార్జీలను భారీగా పెంచింది మెట్రో రైలు సంస్థ. హైదరాబాద్ మెట్రోలో వేలాది మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ సులువుగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అయితే గత కొంతకాలంగా ఎల్ అండ్ టి సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో చార్జీల పెంపుపై ప్రభుత్వానికి మెట్రో సంస్థ నివేదికలు అందజేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చార్జీలను పెంచుతున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
పెంచిన చార్జీలు మే 17 నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ వెల్లడించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు.
దానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి