 
                కర్రేగుట్టలు నక్సల్స్ రహితంగా మారాయని పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఇందులో 16 మంది మహిళలున్నట్లు తెలిపారు. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేయగా మృతులపై 1.72 కోట్ల రివార్డులున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరిగి భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు భారీగానే ఎదురుదెబ్బ తగిలింది.
“కర్రెగుట్ట కొండలు చుట్టూ ఏప్రిల్ 21న ఆపరేషన్ కగార్ పేరుతో దీనిని ప్రారంభించాం. దాదాపు 21 రోజలు పాటు జరిగిన భారీ ఆపరేషన్లో దాదాపు 20,000మంది సిబ్బంది పాల్గొన్నారు. చత్తీస్గఢ్ పోలీసులు, సీఆపీఎఫ్ సిబ్బంది ఉన్నారు. మే 11న ఆపరేషన్ను విరమించుకున్నాం. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయి. 16 మంది మహిళ కేడర్స్తో సహా 31మంది మావోయిస్టులు మరణించారు” అని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్గౌతమ్ తెలిపారు.
వారి నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, ఇతర ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ సహా 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇక మృతుల్లో 28 మందిని గుర్తించినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. వారిలో రూ. 1.75 కోట్ల రివార్డ ఉన్న మావోయిస్టు కూడా చనిపోయినట్లు తెలిపారు.
“కర్రెగుట్టలో 214 బంగర్లు గుర్తించి ధ్వంసం చేశాం. 450 ఐఈడీలు, 818 బారెల్ గ్రెనేడ్ లాంచర్ల షెల్స్, 899 కార్డ్టెక్స్ డిటోనేటర్లు, భారీ మొత్తం పేలుడు పదార్థలను స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా దాదాపు 12,000 కిలోల ఆహార పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. దేశంలోని 6 జిల్లాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఒక్కొక్కటి ఉన్నాయి” అని సీఆర్పీఎఫ్ డీజీ వివరించారు.
“ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. నక్సలిజాన్ని ఎలాగైనా నిర్మూలించాలి. ఇదే మా ప్రతిజ్ఞ. ఇక ఈ ప్రాంతంలో మా కదలికను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
“పూర్వం, ప్రజలు ఆలయంలో పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ నక్సలైట్ శిబిరాలు ఏర్పాటు చేసినప్పటీ నుంచి ఈ కార్యకలాపాలు ఆగిపోయాయి. మేం దాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని డీజీపీ వివరించారు. కర్రెగుట్టలతోపాటు పరిసర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని సీఆర్ పీఎఫ్ డీజీ జ్నానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
“2026లో దేశం నక్సల్స్ నుండి విముక్తి పొందుతుంది. తెలంగాణ నక్సల్స్ కమిటీని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సిఆర్ ఎఫ్ పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. వ్యూహాం ప్రకారం ఆపరేషన్ నిర్వహించాం” అని చెప్పారు. ఏప్రిల్ 21 నుండి మే 11 వరకు ఆపరేషన్ కొనసాగింది. 18 మంది జవాన్లు గాయపడగా ఇప్పుడు వారంతా సురక్షితంగా ఉన్నారు” అని వివరించారు.
నక్సల్స్ ఏరివేతకు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌లో భారత్ సాధించిన చరిత్రాత్మక విజయంగా దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. కర్రెగుట్టలు ఒకప్పుడు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవని, ఇప్పుడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 21 రోజుల్లోనే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని ప్రశంసించారు.
ప్రధానమైన మావోయిస్టు గ్రూప్‌లన్నింటికీ కర్రెగుట్టలు ఒకప్పుడు ప్రధాన కార్యాలయంగా ఉండేవని, ఇక్కడే పోరాట వ్యూహాల రూపకల్పన, ఆయుధాల అభివృద్ధి, ఫైటర్లకు శిక్షణ జరిగేవని అమిత్‌షా చెప్పారు. మన బలగాలు ఒక్కరిని కూడా కోల్పోకుండా కేవలం 21 రోజుల్లో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.





More Stories
జబల్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు ప్రారంభం
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్