
థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో నదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజీర్ వనీ, యవర్ అహ్మద్ భట్ హతయ్యారు.
ఇదిలా ఉండగా షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్ ఉల్ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి.
More Stories
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి