అరుణాచల్ ప్రదేశ్ అంశంలో చైనా వ్యవహరిస్తున్న తీరును భారత్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాన్ని తమ మ్యాప్‌లో చైనా చూపించుకుంటున్నది. ఇక అరుణాచల్‌లోని పేర్లను కూడా చైనా మార్చేసింది. కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ ఇదో వ్యర్థ ప్రయత్నమని పేర్కొన్నది.
అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగమని భారత్ స్పష్టం చేసింది. అరుణాచల్‌ను జాంగ్‌నాన్‌గా చైనా రిఫర్ చేస్తున్నది. టిబెట్‌కు దక్షిణ భాగంగా తన మ్యాచ్‌లో ప్రదర్శిస్తున్నది. డ్రాగన్ చేస్తున్న ఆ ప్రయత్నాలు భారత్ కొట్టివేసింది. పేర్లు మార్చే ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని గతంలో రెండు దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ భూభాగం అని, ఆ రాష్ట్రాన్ని తమ నుంచి వేరు చేయలేరని విదేశాంగ శాఖ తెలిపింది. చైనా పేర్లను సృష్టిస్తోందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. భారత్ లో అరుణాచల్ అంతర్గతమని, విడదీయలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
బీజింగ్ ఈ ‘పేరు మార్చే’ విన్యాసాన్ని ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు;అక్టోబర్ 2024లో తూర్పు లడఖ్‌లోని రెండు సైన్యాలను విరమించుకోవడానికి జరిగిన ఒప్పందం తర్వాత ఇది మొదటి ప్రయత్నం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశానికి దారితీసింది.సరిహద్దు సమస్యను పరిష్కరించే బాధ్యతను ఇద్దరు నాయకులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి అప్పగించారు.
గత ఏడాది ఏప్రిల్‌లో రెండు దేశాలు అనేక ప్రాంతాలకు పేర్లు పెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న కొన్ని పట్టణాలక చైనా పేర్లు పెట్టింది. దీనికి బదులుగా టిబెట్‌లో ఉన్న 30 ప్రాంతాలకు భారత్ పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. పేర్లు పెట్టే ప్రక్రియతో చైనా రాజకీయం చేస్తున్నట్లు భారత్ ఆరోపించింది. అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షి ఒప్పందాల ప్రకారం ఆ ప్రక్రియ నిలవదన్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్