
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను పోస్ లియో స్వాగతించారు. పోప్‌గా ఇటీవలే ఎన్నికైన లియో తన మొదటి ఆదివారం మధ్యాహ్నం ఆశీర్వాదం ఇచ్చారు. సెయింట్ పీటర్స్ బసిలికా లాగ్గియా నుంచి పోప్ లియో మాట్లాడుతూ ఈ కాల్పుల విరమణను స్వాగతించారు. అలాగే, ‘రాబోయే చర్చల ద్వారా, త్వరలో శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
అలాగే ఉక్రెయిన్‌లో న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి పిలుపునిచ్చారు. గాజాలో తక్షణ కాల్పుల విరమణకూ పోప్ లియో పిలుపునిచ్చారు. గాజా, ఇజ్రాయిల్‌ల్లో ఉన్న బందీలను విడుదల చేసిన మానవతా సహాయం అందించాలని కోరారు. ‘ఇంకెప్పుడూ యుద్ధం వద్దు’ అని పోప్ స్పష్టం చేశారు.
80 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, నేడు కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తున్న సంఘర్షణలను పోప్ ఖండించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలను ‘ముక్కలుగా మూడో ప్రపంచ యుద్ధం’ అని పోప్ అభివర్ణించారు. అలాగే ఆదివారం మదర్స్ డే సందర్భంగా తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఆదివారం వాటికన్ సిటీ ప్రత్యేక కోలహాలంతో నిండిపోయింది. మార్చింగ్ బ్యాండ్లతో నిండిన జనసమూహం..అభినందనలు, సంగీతంతో వీధుల్లో సందడి చేసింది. చాలా మంది యాత్రీకులు తమ స్వదేశాల జెండాలను పట్టుకున్నారు. వివిధ ప్రత్యేక బృందాలకు పోప్ లియో శుభాకాంక్షలు తెలిపారు.
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’