
ఆదంపుర్ సందర్శనలో త్రిశూల్ చిత్రం కలిగిన టోపీ ధరించారు. కాగా, ఈ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. అక్కడికి వెళ్లి పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరంలో ఉన్నప్పుడు, ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ, మిగ్-29 జెట్లు స్పష్టంగా చెక్కుచెదరకుండా కనిపించాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేయడంతో ప్రతిగా పాకిస్థాన్ భారత్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే భారత వాయుసేన వాటన్నింటినీ నేలకూల్చింది. దీనితో ఏం చేయాలో తెలియక, దిక్కుతోచక, పాక్ అబద్దపు ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది.
రష్యా తయారీ ఎస్-400ను తాము ధ్వంసం చేశామని చెప్పుకుంటూ కొన్ని నకిలీ వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. అక్కడితో ఆగకుండా ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న ఎస్-400 ఉపగ్రహ ఛాయా చిత్రం అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది. కానీ, ఇక్కడే పాక్ దొరికిపోయింది. పాక్ విడుదల చేసిన ఆ చిత్రంలో క్రెటర్లు, శిథిలాలు, దెబ్బతిన్న పరికరాలు ఏమీ కనిపించలేదు.
చివరికి పాక్ ప్రధాని పోస్ట్ చేసిన ఫొటోల్లోనూ ఎస్-400 ధ్వంసానికి సంబంధించిన వివరాలు ఏమీ కనిపించలేదు. దీనితో పాక్ అబద్దపు ప్రచారాలు బయటపడి, ప్రపంచం ముందు నవ్వులపాలైంది. ఈ పర్యటన ద్వారా మోదీ రెండు సందేశాలను ప్రపంచానికి స్పష్టం తెలియజేశారు.
1. పాకిస్థాన్ జేఎఫ్-17 యుద్ధ విమానం నుంచి క్షిపణులు ప్రయోగించి, ఆదంపూర్‌లోని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు అబద్దపు ప్రచారాలు చేసింది. కానీ మోదీ సందర్శన సమయంలో అక్కడ ఉన్న ఎస్-400 చెక్కు చెదరకుండా అక్కడే ఉంది. దీని ద్వారా పాక్ చెంప చెల్లుమనిపించారు మోదీ. 2. భారతదేశ భద్రత గురించి మోదీ సర్కార్‌కున్న నిబద్ధతను ప్రపంచానికి చూపించారు.
అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్లడించారు. ధైర్యసాహాసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది, సైనికుల్ని కలుసుకున్నట్లు చెప్పారు. ధైర్యాన్ని, అకుంఠిదీక్షను, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవడం ప్రత్యేకమైన అనుభవం అని మోదీ తెలిపారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందని తెలిపారు.
“ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే సైనికులతో ఉండడం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశ రక్షణ కోసం, మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారత్ ఎప్పటికీ కృతజ్ఞతో ఉంటుంది” అంటూ ఈ సందర్భంగా ప్రధాని వారి ధైర్య సాహసాలను కొనియాడారు. ఆదంపుర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపారు ప్రధాని మోదీ.
ఆదంపూర్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. ఇది 1965 యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించింది. భౌగోళికంగా చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్‌బేస్ భారత ఉత్తర వైమానిక రక్షణకు అత్యంత కీలకమైనది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు