
బ్రిటన్ ప్రభుత్వం వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే దిశగా వీసా, వలస చట్టాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. అదేగనుక జరిగితే యూకేలో పనిచేయాలని, అక్కడ శాశ్వత నివాస హోదా పొందాలని కలలు కనే వలసదారులు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడనుంది. వీసా రూల్స్ మార్పులకు సంబంధించి కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్ పార్లమెంట్లో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
కాగా 2024లో యూకే ప్రభుత్వం విదేశీయులకు 2,10,098 వర్క్ వీసాలను ఇచ్చింది. 2023తో పోల్చుకుంటే వీసాల జారీలో 37 శాతం తగ్గుదల ఉంది. వర్క్ వీసాలను పొందిన వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారు. 2024లో జూన్‌తో ముగిసే 12 నెలల కాలానికి భారతీయులు 1,16,000 వీసాలు పొంది పని నిమిత్తం యూకే వెళ్లారు. 2023లో ఈ సంఖ్య 1,27,000గా ఉంది.
భారతీయులకు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, ట్రేడ్ సెక్టార్లలో పనిచేసేందుకు వీసాలు లభిస్తున్నాయి. ప్రజల నుంచి వినిపిస్తోన్న ఆందోళన, వలసలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ‘రిఫార్మ్ యూకే’కు పెరుగుతున్న ప్రజాదరణ లాంటి అంశాలు వీసా, వలస చట్టాల్లో మార్పులపై స్టార్మర్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించేందుకు కారణమవుతున్నాయి.కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇమిగ్రేషన్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ బలోపేతం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. తమ దేశానికి అర్థవంతమైన సహకారం అందించేవారికి మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదిత మార్పుల ప్రకారం స్కిల్డ్ వర్కర్ వీసా దరఖాస్తుదారులు కనీసం యూనివర్సిటీ డిగ్రీ కలిగి ఉండాలి. యూకేకు వచ్చే వ్యక్తులు సరైన అర్హత కలిగిఉన్నారని నిర్ధారించుకోవడం దీని లక్ష్యం.
అదేవిధంగా ఆంగ్ల భాషాపరమైన నియమాలను కూడా పటిష్టం చేయనున్నారు. వీసా హోల్డర్‌పై ఆధారపడిన వారు ప్రాథమికస్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కలిగిఉండాలి. పర్మినెంట్ రెసిడెన్సీ రూల్స్ కూడా మారనున్నాయి. అక్కడ స్థిరనివాస హోదా పొందాలనుకునే విదేశీ కార్మికులు 10 సంవత్సరాలు ఆ దేశంలోనే నివసించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అది ఐదు సంవత్సరాలుగా మాత్రమే ఉంది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి