పీవోకే లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమయ్యిందని భారత సైన్యాధికారులు వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ త్రివిధ దళాల డీజీఎంవోలు ఆపరేషన్ సిందూర్ పై సోమవారం మీడియా సమావేశంలో పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను రక్షణశాఖ అధికారులు ప్రదర్శించారు. పాకిస్థాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదని తెలిపారు. తరువాత పాక్‌లోని నూర్ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు.
”పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశాం. పీవోకే భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టాం. మన సైన్యానికి ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం” అని తెలిపారు.
మన మిలిటరీ బేస్‌లు, మన వ్యవస్థలన్నీ పూర్తిగా ఆపరేషన్‌లో ఉన్నాయని, భవిష్యత్తులో ఎటువంటి మిషన్ అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భార్తి తెలిపారు. మీడియా సమావేశంలో చైనాకు చెందిన పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ శకలాలను చూపించారు. ఇండియాపై దాడి చేసిన సమయంలో పాకిస్థాన్ ఆ మిస్సైల్‌ను వాడినట్లు తెలుస్తోంది. టర్కీకి చెందిన వైఐహెచ్, సోన్గార్ డ్రోన్ల శకలాలను కూడా ప్రదర్శించారు.

More Stories
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం