కాల్పుల విరమణ జరిగిన ఒక రోజు తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత సాయుధ దళాల శక్తి “రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంకు తెలిసిందని తెలిపారు.భారత సాయుధ బలగాల సత్తా సరిహద్దులకే పరిమితం కాలేదని, పాక్ సైని ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోని గర్జించిందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో సింగ్ వర్చువల్‌గా మాట్లాడుతూఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని చెప్పారు.
పాకిస్థాన్ తో ఉద్రిక్తతల వేళ భారతసైన్యం ధైర్య సాహసాలతోపాటు సంయమనాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌లోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేసి పహల్గాం ఉగ్రదాడికి ధీటైన సమాధానం ఇచ్చిందని ఆయన కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఉన్న రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రాజ్‌నాథ్ చెప్పారు.
భారత సైన్యం ఎప్పుడూ పాకిస్థాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, కానీ పాకిస్థాన్ మాత్రం భారతదేశంలోని పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని చెప్పారు.
”ఇది నయాభారత్…ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోమని ఆపరేషన్ సిందూర్‌తో చాటిచెప్పాం” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రత్యేక కారణాల వల్ల ఈరోజు తాను లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన రోజునే లక్నో యూనిట్ ప్రారంభం కావడం గొప్పగా ఉందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో బ్రహ్మోస్ పవర్ ఎంటో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిందని, ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే పాకిస్తాన్ వెళ్లి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చమత్కరించారు.
”ఉగ్రవాదానికి సంబంధించిన ఎలాంటి చర్యనైనా యుద్ధ చర్యగా భావిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టిస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సమయం వచ్చింది. ప్రధానమంతి నాయకత్వాన్ని, ఉగ్రవాద నిర్మూలనా సందేశాన్ని చాటి చెప్పేందుకు యావద్దేశం, ఉత్తరప్రదేశ్ ఏకతాటిపై నిలవాలి” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. .
ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని చెబుతూ దాన్ని సరిచేయాలంటే శాంతి వచనాలు పనిచేయవని, వారి సొంత భాషలోనే సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే బాటలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చిందని చెప్పారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు