జూన్ 5న అయోధ్య రామ దర్బార్ లో దేవతా విగ్రహాలు

జూన్ 5న అయోధ్య రామ దర్బార్ లో దేవతా విగ్రహాలు
అయోధ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామాలయం మొదటి అంతస్తులోని రామ దర్బార్లో దేవతా విగ్రహాలను  పవిత్రమైన గంగా దసరా రోజున జూన్ 5న ప్రతిష్ఠించనున్నారు. తర్వాతి రోజు (జూన్ 6) నుంచి రామయ్య దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు. జూన్ 3 నుంచి అయోధ్య రామమందిరంలో మూడు రోజులపాటు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. 
అన్ని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జూన్ 5తో ముగుస్తాయి. ఆ తర్వాత రామ భక్తులకు దర్శనం లభిస్తుంది. రామదర్బార్లో రామయ్య, సీత, లక్ష్ణణుడు, ఇతర దేవుళ్ల దర్శనం కోసం శ్రీరామజన్మభూమ తీర్థ్ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది.  ముందుకుగా వచ్చేవారి కోసం 750 పాస్లను జారీ చేయాలని నిర్ణయించింది. దేవాలయ ప్రాంగణంలో సమావేశమైన ఆలయ కమిటీ ఈ మేరకు వెల్లడించింది.
రామాలయ నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, టాటా ఇంజినీర్లతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న ఏడు దేవాలయాల పనులు మే నెల చివరినాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే రామాలయ సముదాయంలోని రెండు దేవాలయాల్లో మినహా అన్నింట్లోనూ ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మే 23న రామ దర్బార్ గర్భగుడిలో విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు.  మే 30కంటే ముందే లక్ష్మణుడి విగ్రహాన్ని శేషావతార్ ఆలయంలో ప్రతిష్ఠ చేస్తామని పేర్కొన్నారు. అన్ని దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్టించిన తర్వాత పూజలు స్పష్టం చేశారు. “జూన్ 3- 5 వరకు అయోధ్య రామాలయంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేస్తాం” అని తెలిపారు. 

“మొదటి అంతస్తులో భక్తుల బరువు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని నిర్మించాం. మొదటి అంతస్తులోకి భక్తుల ప్రవేశం ఆధారంగా సీబీఆర్ఐ రూర్కీ మూడు నెలల పాటు అధ్యయనం నిర్వహిస్తుంది. ఆలయంలోని రాళ్లు ఏమైనా దెబ్బతిన్నాయా లేదా అని పరిశీలిస్తుంది. అందుకు ఆలయంలో 10 సెన్సార్లు ఏర్పాటు చేశాం.” అని నృపేంద్ర మిశ్రా వివరించారు.