ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయని పాకిస్తాన్ మంత్రులు ఇటీవల బహిరంగాగానే ఒప్పుకుంటున్నారు.  ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో అంగీకరించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే.
గతంలో ఉగ్రవాదులతో తమకు సంబంధాలు ఉండేవని, దాని వల్ల దేశం చాలా కోల్పోయిందని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భుట్టో వెల్లడించారు. “రక్షణ మంత్రి(క్వాజా ఆసిఫ్ ) చెప్పిన దాని ప్రకారం, పాకిస్థాన్‌కు గతం (ఉగ్రవాదులతో సంబంధాలు) ఉందనే విషయం రహస్యమని నేను భావించడం లేదు. దాని కారణంగా మనం. పాకిస్తాన్ బాధపడింది” అని చెప్పారు.
“మనం ఉగ్రవాదం, అతివాదాలను ఎదుర్కొన్నాం. కానీ మనం అనుభవించిన దాని ఫలితంగా, పాఠాలు కూడా నేర్చుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్తాన్ చరిత్ర చూసుకుంటే, అప్పుడు చేసిన తప్పు మనం ఇప్పుడు చేయడం లేదు. అది మన చరిత్రలో ఒక దురదృష్టకర భాగం అనేది నిజం” అని పేర్కొన్నారు.
అయితే, ఇంతకుముందు గురువారం మీర్పుర్ఖాస్లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన భుట్టో మరోసారి శాంతి వచనాలు వల్లి వేశారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని, కానీ భారత్ తమను రెచ్చగొడితే యూద్ధానికి సిద్ధంగా ఉందని మేకపోతు గాంభీర్య ప్రదర్శించారు. “పాకిస్తాన్ శాంతియుత దేశం, ఇస్లాం శాంతియుత మతం. మేము యుద్ధం కోరుకోము. కానీ ఎవరైనా మన సింధుపై దాడి చేస్తే, వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మేము యుద్ధ ఢంకా మోగించము. కానీ రెచ్చగొడితే, పాకిస్థాన్ అంతా ఒక్కటై గర్జిస్తే మీరు తట్టుకోలేరు” అని భుట్టో అవాకులు చెవాకులు పేలారు.
అంతకు ముందు రక్షణ మంత్రి పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిదని వ్యాఖ్యానించారు. అయితే, అది తమ దేశ చరిత్రలో ముగిసిన అధ్యాయమని, ఒక దురదృష్ట భాగం అని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని, ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని తర్వాత అర్థమైనట్లు చెప్పారు.

More Stories
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
80 ఏళ్ల తర్వాత వైట్ హౌస్ కు సిరియా అధ్యక్షులు