
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్ బి) బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మే 1 నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో గల 4 బ్యాంకులు గ్రామీణ ఒకటయ్యాయి. రాష్ట్రంలో నాలుగు రకాల పేర్లు మీద ఉన్న బ్యాంకులు ఇక నుంచి ‘ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’ పేరుతో నడుస్తాయి.
స్టేట్‌బ్యాంకు ఆధీనంలో ఆంధ్రపదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, కెనరాబ్యాంక్ ద్వారా ఆంధ్ర ప్రగతి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు 4 వేరువేరు పేర్లతో ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాలు అందించేందుకు 1976లో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్లు ఏర్పడ్డాయి.
వీటి నిర్వహణలో ఆర్‌బీఐకు 50%, కేంద్ర ప్రభుత్వానికి 35%, ప్రాయోజిత బ్యాంకుకు 15% బాధ్యత ఉంటుంది. ఒకప్పుడు దేశంలో 196 ఉండే గ్రామీణ బ్యాంకులు ఏకీకరణ ప్రక్రియతో ప్రస్తుతం 28కి కుదించారు. 4 వేర్వేరు గ్రామీణ బ్యాంకులు కలిపి ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ప్రాయోజిత బ్యాంకుగా ‘ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’గా అవతరించింది. దీని హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉండబోతోంది.
దేశంలోని 11 రాష్ట్రాల పరిధిలోని 15 గ్రామీణ బ్యాంకులను ఏకీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా 43 రీజనల్ రూరల్ బ్యాంక్ల సంఖ్య 28కి తగ్గింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 బ్యాంకులు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 3 బ్యాంకులు, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో 2 బ్యాంకులు ఉన్నాయి.
ఇకపై ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండనుంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 196 రూరల్ బ్యాంక్లు ఉండేవి. 2004-25 నుంచి 2020-21 వరకు 3 దశల్లో చేపట్టిన విలీన ప్రక్రియ వల్ల బ్యాంకుల సంఖ్య క్రమంగా 43కు చేరింది. ప్రస్తుతం చేపట్టిన 4వ విడత ప్రక్రియ ద్వారా ఈ సంఖ్య 28కి వచ్చింది.
More Stories
విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యం
తిరుమల పరకామణి ఘటనపై సిట్ విచారణ
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం