
అమరావతి పునః నిర్మాణంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో చేపట్టే రూ. 49,040 కోట్ల పనులకు మోదీ లాంచనంగా శ్రీకారం చుట్టారు. శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు
కాగా ఇదే వేదిక నుంచి ఎపి లో చేపట్టనున్న పలు ప్రాజెక్ట్ లను వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవాలు చేవారు మోదీ. భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో), డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వే శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి రూ.57,962 కోట్లు ఖర్చు చేయనున్నారు. నాగాయలంకలోని గుల్లలమోద దగ్గర ₹1,500 కోట్లతో మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్ నిర్మాణానికి వర్చువల్గా ప్రధాని భూమి పూజ చేశారు.
విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు కూడా శంకుస్థాపన చేశారు మోడీ. అలాగే, రూ. 293 కోట్ల వ్యయంతో గుంతకల్లు వెస్ట్ నుంచి మల్లప్పగేటు వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు, రూ3,176 కోట్లతో నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ. 3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించారు. రూ. 254 కోట్లతో పూర్తిచేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్ను, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం రైల్వేలైన్లకు కూడా మోదీ జాతికి అంకితం చేశారు.
మొత్తం 57,962 కోట్లు విలువ గల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం ఇచ్చారు. అమరావతిలో రూ.49,040 కోట్లతో 74 ప్రాజెక్టు పనులకు అదనంగా రూ.5028 కోట్లతో చేపట్టే తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.3680 కోట్లతో నిర్మాణం పూర్తైన 8 జాతీయ రహదారుల ప్రారంభించారు. మరో రూ.254 కోట్లతో నిర్మించిన మూడు రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు.
10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కేటాయింపులు
- రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15000 కోట్లు
- హుడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి రూ.11000 కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా రూ.12,157 కోట్లు
- పేదలకు అందించే టిడ్కో గృహాల నిర్మాణానికి రూ. 4400 కోట్లు
- రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం రూ. 73,743 కోట్లు
- తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో రూ. 2139 కోట్లతో క్రిస్ సిటీ
- అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ. 1,85,000 కోట్లతో ఎన్ జి ఎల్ గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం
- అమరావతికి రూ. 2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు
- స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు రూ. 11, 440 కోట్లు
- విశాఖ జిల్లా నక్కపల్లిలో రూ.1877కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్
- సిఆర్ఐఎఫ్ పథకం క్రింద 200.06 కి.మీ 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు
- రణస్థలం 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి రూ. 252.42 కోట్లు
- గుంటూరు – నల్లపాడు ఆర్ఓబి నిర్మాణానికి రూ. 198 కోట్లు
- పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కోసం రూ.168 కోట్లు
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి