
మరోవైపు పాకిస్థానీ నటులైన మహీరా ఖాన్, హనియా ఆమిర్, అలీ జఫర్, ననమ్ సయీద్ సహా అనేక మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. అలీ జాఫర్, సనమ్ సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సాజల్ అలీ వంటి పాకిస్థానీ సెలబ్రెటీల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు భారత్‌లో కనిపించకుండాపోయాయి. ‘అకౌంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా’ అని ఆయా అకౌంట్లలో దర్శనమిస్తున్నాయి. అయితే ఫవద్ ఖాన్, వాహజ్ అలీ వంటి పలువురు ప్రముఖ పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్లు ఇప్పటికీ భారత్‌లో యాక్టివ్‌గానే ఉండటం గమనార్హం.
కాగా, భారత్ నిషేధించిన యూట్యూబ్ చానళ్లలో డాన్, సమా టీవీ, ఆరే న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్, ది పాకిస్థాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రాజీ నామా ఉన్నాయి. అలాగే ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ అనే నలుగురు జర్నలిస్ట్‌ల పేర్లను ఈ జాబితాలో చేర్చింది.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం