
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధరామయ్య పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు అనుకూలం కాదని, యుద్ధం కంటే సామరస్య చర్చలే ముఖ్యమనే ఉద్దేశంలో మాట్లాడానని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఇటువంటి వాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని గ్రహించిన అధిష్టానం హెచ్చరికలు జారీచేసింది. ఉగ్రదాడి విషయంలో నేతలు గీత దాటొద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశించారు.
పార్టీ అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశ ప్రతిష్టకు వ్యతిరేకంగా ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇవాళ బెలగావిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాటిమాటికి ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. గో టూ పాకిస్థాన్ అంటూ నినదించారు. దాంతో సీఎం సహనం కోల్పోయారు.
ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమనిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని కఠిన స్వరంతో ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధరామయ్య తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ అధికారులంటే పాలకులకు అంత చులకనా.? అని పలువురు మండిపడుతున్నారు. కర్ణాటకలో ప్రతిపక్ష జేడీఎస్ కూడా సిద్ధరామయ్య తీరుపై మండిపడింది. సిద్ధరామయ్య నియంతృత్వ ధోరణికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించింది. సిద్ధరామయ్య చేసింది క్షమించారని నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం